ఈ హీరో భార్య ప్రొడ్యూసర్ అని మీకు తెలుసా ..?

తెలుగులో ప్రముఖ సినీ నటుడు మరియు దర్శకుడు శశి దర్శకత్వం వహించిన “రోజా పూలు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన ప్రముఖ తమిళ నటుడు శ్రీకాంత్ గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడంతో శ్రీకాంత్ కి సినిమా పరిశ్రమలోకి మంచి ఆరంభం లభించింది.

 Tamil Actor Srikanth Wife Vandana News-TeluguStop.com

అయితే నటుడు శ్రీకాంత్ నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తమిళ భాషతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ని ఏర్పరచుకున్నాడు.

దీంతో తన చిత్రాలని అప్పుడప్పుడు తెలుగు అనువాదంతో టాలీవుడ్ లో కూడా విడుదల చేస్తూ ఫర్వాలేదనిపిస్తున్నాడు.

 Tamil Actor Srikanth Wife Vandana News-ఈ హీరో భార్య ప్రొడ్యూసర్ అని మీకు తెలుసా ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే విదేశాల్లో చదువుని పూర్తి చేసినటువంటి శ్రీకాంత్ నటనపై ఉన్నటువంటి ఆసక్తితో లక్షల రూపాయలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని మరీ సినిమా పరిశ్రమకి వచ్చాడు.

అయితే ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ ఆశించిన స్థాయిలో తన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు.

దీంతో కథల విషయంలో కొంత మేర ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.కాగా ఆ మధ్య నితిన్ హీరోగా నటించిన “లై” అనే చిత్రంలో రెండో హీరోగా నటించి పర్వాలేదనిపించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యింది.

దీంతో “రాగల 24 గంటల్లో” అనే చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కనిపించాడు.కానీ ఈ చిత్రం కూడా శ్రీకాంత్ కి పెద్దగా కలిసి రాలేదు.

Telugu Co Producer, Khaki Movie, Lie Movie, Nithin, Sambhavam Movie, Srikanth, Srikanth Latest Movies, Srikanth Wife Vandana, Tamil Actor, Tamil Actor Srikanth Wife Vandana News, Tamil Film Producer, Tamil Hero, Tamil Producer, Tollywood, Vandana-Movie

దీంతో శ్రీకాంత్ భార్య వందన ఎక్కువగా శ్రీకాంత్ చిత్రాలకి సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది.అయితే వందన కూడా సినీ కుటుంబం బ్యాగ్రౌండ్ లో ఉన్నటువంటి కుటుంబం నుంచి రావడంతో ఆమెకు ప్రొడక్షన్ పనుల్లో మంచి పట్టు ఉంది.అందువల్లనే తన భర్త చిత్రాలకి తానే సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు ఆమధ్య ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పేర్కొంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రీకాంత్ తెలుగులో “ఖాకీ” అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.

అలాగే తమిళంలో “సంభవం” అనే చిత్రంలో కూడా హీరోగా నటిస్తున్నాడు.గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న శ్రీకాంత్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని చాలా తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

#Vandana #TamilActor #SrikanthLatest #Tamil Actor #Srikanth

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు