ఆ సినిమా మిస్ చేసుకున్నాను.. నేనే నా కేరీర్ ని ఇలా చేసుకున్నా.. నటుడు జై!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో జై గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.హీరో జై పేరు వినగానే చాలామందికి జర్నీ సినిమా గుర్తుకు వస్తుంది.

 Tamil Actor Jai Reveals He Missed Lead Role In Vinnai-thaandi-varuvaaya Movie Details, Hero Jai, Tami Actorl, Journey Movie, Vinnai Thaandi Varuvaaya, Tamil Hero Jai, Journey Movie, Shimbu, Trisha, Hero Jai Career, Hero Jai Movies, Director Goutam Vasudev Menon-TeluguStop.com

సినిమా కంటే ముందు తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ జర్నీ సినిమా జైకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.ఆ తర్వాత రాజా రాణి సినిమాల్లో కూడా నటించి మెప్పించాడు హీరో జై.ఆ సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో తమిళంలో మంచి మంచి సినిమాలు చేస్తూ ముందుకు వెళ్లిపోయాడు.అనంతరం కొన్ని ఫ్లాపులు పలకరించడంతో కెరీర్ కొంచెం డల్ అయ్యింది.

ఈ తరుణంలో జై కెరీర్‌లో మొదటిసారి తమిళ మూవీ పట్టంబూచిలో విలన్‌గా చేస్తున్నాడు.

 Tamil Actor Jai Reveals He Missed Lead Role In Vinnai-thaandi-varuvaaya Movie Details, Hero Jai, Tami Actorl, Journey Movie, Vinnai Thaandi Varuvaaya, Tamil Hero Jai, Journey Movie, Shimbu, Trisha, Hero Jai Career, Hero Jai Movies, Director Goutam Vasudev Menon-ఆ సినిమా మిస్ చేసుకున్నాను.. నేనే నా కేరీర్ ని ఇలా చేసుకున్నా.. నటుడు జై-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మూవీ త్వరలో విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్స్‌‌లో భాగంగా బిజీబిజీగా ఉన్నాడు జై.ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా జై తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన విన్నై తాండి వరువాయా తెలుగులో ఏ మాయ చేశావే సినిమా 2010లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తేలిసిందే.

ఈ చిత్రంలో శింబు త్రిష హీరోహీరోయిన్లుగా నటించగా ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు.

Telugu Goutamvasudev, Jai, Jai Career, Journey, Shimbu, Tami Actorl, Tamil Jai, Trisha, Vinnaithaandi-Latest News - Telugu

కాగా నిజానికి ఈ మూవీ ఆఫర్ మొదట జైకే వచ్చిందట సినిమాలో శింబు పాత్ర కోసం ఆ మూవీ టీం ఆయనను అప్రోచ్ అవ్వగా ఆ సమయంలో బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సినిమాని చేయలేకపోయాడట.దానికి గురించి జై మాట్లాడుతూ ఆ సినిమా ఆఫర్ మొదట నాకే వచ్చింది.కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడం వల్ల ఆ మూవీని వదులుకున్నా.

ఒకవేళ నేను ఆ చిత్రాన్ని చేసుంటే నా కెరీర్ ఇప్పటిలా కాకుండా మరోలా ఉండేది అని ఆవేదన వ్యక్తం చేశాడు జై.ఇక ప్రస్తుతం జై అడపా దడపా సినిమాలలో నటిస్తు బిజీ బిజీగా గా ఉన్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube