ఈ విలన్ భార్య తెలుగులో హీరోయిన్ అని మీకు తెలుసా...?

తెలుగులో ఆ మధ్య టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజా చిత్రంలో విలన్ పాత్రలో కనిపించి తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో అలరించిన ప్రముఖ తమిళ నటుడు “బాబీ సింహ” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే బాబీ సింహ పుట్టి పెరిగింది హైదరాబాద్ మహానగరంలోనే అయినప్పటికీ అనుకోకుండా తన తల్లిదండ్రులు తమిళనాడు రాష్ట్రంలోని కొడైకెనాల్ పరిసర ప్రాంతానికి వలస వెళ్లడంతో ఎక్కువగా తమిళంలోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Tamil Actor Bobby Simha Wife Reshmi Menon News-TeluguStop.com

తాజాగా నటుడు బాబీ సింహ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన ప్రేమ, పెళ్లి విషయాల గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా తన భార్య రేష్మి మీనన్ తో కలిసి ఓ సినిమాలో పనిచేస్తున్నప్పుడు ఆమెతో ప్రేమలో పడ్డానని తెలిపాడు.

 Tamil Actor Bobby Simha Wife Reshmi Menon News-ఈ విలన్ భార్య తెలుగులో హీరోయిన్ అని మీకు తెలుసా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత రేష్మి మీనన్  కుటుంబ సభ్యులకు కూడా తాను బాగా నచ్చడంతో ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చాడు.అయితే తన భార్య రేష్మి మీనన్ తనను ఎంతగానో అర్థం చేసుకుందని అందువల్లనే ఒక పక్క తన సినీ కెరీర్ మరో పక్క కుటుంబ బాధ్యతలు చాలా చక్కగా చక్కబెడుతోందంటూ తన భార్య పై ఉన్నటువంటి మమకారాన్ని, ప్రేమని తెలియజేశాడు.

ఇక తాను తన కుటుంబ సభ్యులకు తన స్టార్ డమ్ మరియు షూటింగులు వివరాలు అలాగే చిత్ర వివరాలు వంటి వాటి గురించి పెద్దగా తెలియవని తాను కూడా ఎప్పుడూ కూడా తన కుటుంబ సభ్యులతో ఈ విషయాల గురించి చర్చించనని తెలిపాడు కానీ అప్పుడప్పుడు తన తల్లి మాత్రం ఫోన్ చేసి ఏదైనా సినిమాలో నటిస్తున్నావా.? డబ్బులు ఏమైనా కావాలా ? అంటూ అడుగుతుందని సరదాగా చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలాఉండగా రేష్మి మీనన్ కూడా తెలుగులో టాలీవుడ్ ప్రముఖ నటుడు మరియు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ హీరో గా నటించిన హైదరాబాద్ లవ్ స్టోరీ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.అలాగే తెలుగు హీరో సాయి రామ్కా శంకర్ నటించిన నేనోరకం అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది.

కానీ ఈ రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేక పోవడంతో ఈ అమ్మడి గురించి చాలా మందికి తెలియదు.కానీ తమిళం, మలయాళం, తదితర భాషలలో మాత్రం రేష్మి మీనన్ దాదాపుగా పదికి పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

#Tamil Actor #Bobby Simha #Reshmi Menon #HyderabadLove #TamilActor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు