కళ్ల కింద నల్లటి వలయాలకు చింతపండు వైద్యం...ఆశ్చర్యంగా ఉందా?  

Tamarind Improves Skin Tone-

కళ్ల కింద నల్లటి మచ్చలకు చింతపండు వైద్యం ఏమిటా అని ఆలోచిస్తున్నారానిజం సిట్రిక్ యాసిడ్ లక్షణాలు ఉన్న చింతపండు ఎన్నో ఆరోగ్య సమస్యలకపరిష్కారం చూపుతుంది. కడుపు ఉబ్బరం,త్రేన్పులు,వికారం,జ్వరం వంటసమస్యలకు చక్కగా పనిచేస్తుంది..

కళ్ల కింద నల్లటి వలయాలకు చింతపండు వైద్యం...ఆశ్చర్యంగా ఉందా?-

రెండు స్పూన్ల చింతపండు రసం ఉదయాన్నే తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గి ఆకలపెరుగుతుంది.

నొప్పులు,వాపులు ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో చింతపండు రసం రాసి మసాజ్ చేస్తమంచి ఫలితం కనపడుతుంది.

దెబ్బల వల్ల వచ్చిన వాపులు, బెణుకులకు చింతపండు గుజ్జును ఉడికించి వేడిగఉన్నప్పుడే రాసి కొంతసేపు ఆలా ఉంచితే బెణుకులు తగ్గుతాయి.

చింతపండు కేవలం ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా బాగా సహాయపడుతుందిముఖంపై వచ్చే మచ్చలు,బ్లాక్ హెడ్స్ పోవటానికి సహాయపడుతుంది.

అలాగే చర్మకాంతివంతంగా మారటంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.

మొదట ముఖాన్ని ఫెస్ వాష్ తో శుభ్రం చేసుకొని చింతపండు రసాన్ని రాసి నిముషాలు మసాజ్ చేస్తే వచ్చే మార్పు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురచేస్తుంది.

కంటి కింద నల్లటి వలయాలకు చింతపండు రసం మంచి పరిష్కారం.

చింతపండు రసాన్నకంటి కింద నల్లటి వలయాలు ఉన్న ప్రదేశంలో రాస్తే నల్లటి వలయాలు మాయఅవుతాయి. అయితే ఒక వారం పాటు క్రమం తప్పకుండా చేయాలి.

చింతపండు, పాలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేయాలి.

ఈ మిశ్రమాన్నముఖానికి రాసి అరగంట ఆరనివ్వాలి. తర్వాత నీటితో కడిగితే ముఖంపై ముడతలపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

ముఖంపై మృత కణాలను తొలగించడానికి చింతపండు రసం పాలతో కలిపి స్ర్కబ్‌తరాయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.

చూసారుగా చింతపండులో ఎన్ని ఆరోగ్య అందం ప్రయోజనాలు దాగి ఉన్నాయో…మీరకూడా ఉపయోగించండి.