చేతుల‌ను మృదువ‌గా మార్చే చింత‌పండు..ఎలాగంటే?

సాధార‌ణంగా కొంద‌రికి శ‌రీరం ఎంత తెల్ల‌గా ఉన్నాచేతులు మాత్రం డార్క్‌గా, ర‌ఫ్‌గా ఉంటాయి.ఈ క్ర‌మంలోనే చేతుల‌ను మృదువుగా మార్చుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

 Tamarind Helps To Get Rid Of Rough Hands-TeluguStop.com

ఖ‌రీదైన క్రీములు, మాయిశ్చ‌రైజ‌ర్లు, ఆయిల్స్ వాడుతుంటారు.అయితే ఎలాంటి ఖ‌ర్చు లేకుండా అంద‌రి వంటింట్లో ఉండే చింత పండుతో కూడా చేతులును మృదువుగా మార్చుకోవ‌చ్చు.

మ‌రి చింత పండును చేతుల‌కు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 Tamarind Helps To Get Rid Of Rough Hands-చేతుల‌ను మృదువ‌గా మార్చే చింత‌పండు..ఎలాగంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముందుగా వాట‌ర్‌లో చింత‌పండును నాన బెట్టుకుని పేస్ట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పేస్ట్‌లో కొద్దిగా బేకింగ్ సోడా, నిమ్మ ర‌సం వేసి బాగా క‌ల‌పాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చేతుల‌కు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు డ్రైఅవ్వ‌నివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో చేతుల‌ను శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజుకు ఒక సారి చేస్తే చేతులు మృదువుగా, వైట్‌గా మార‌తాయి.

Telugu Beauty, Beauty Tips, Benefits Of Tamarind, Latest News, Rough Hands, Skin Care, Skin Care Tips, Tamarind, Tamarind For Skin-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు
రెండు స్పూన్లు చింత పండు పేస్ట్‌, ఒక స్పూన్ షుగ‌ర్ మ‌రియు చిటికెడు ప‌సుపు వేసుకుని క‌ల‌పాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చేతుల‌కు పూసి మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే.డెడ్ స్కిన్ సెల్స్ పోయి చేతులు కోమ‌లంగా త‌యార‌వుతాయి.

ఇక ఒక గిన్నెలో రెండు స్పూన్ల చింత పండు గుజ్జు, ఒక స్పూన్ల బియ్యం పిండి, అర స్పూన్ రోజ్ వాట‌ర్ వేసి మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని చేతుల‌కు బాగా రుద్దుకుని కాస్త ఆరిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.వారంలో నాలుగు లేదా ఐదు సార్లు ఇలా చేసినా కూడా చేతులు మృదువుగా, కాంతి వంతంగా మార‌తాయి.

#Rough Hands #Skin Care Tips #Skin Care #BenefitsOf #Tamarind

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు