మేలో నవంబర్ స్టొరీ చెప్పబోతున్న తమన్నా

సౌత్ సీనియర్ బ్యూటీస్ అందరూ కూడా సినిమాలు ఓ వైపు చేస్తూనే డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేశారు.అక్కడ సక్సెస్ అయితే కెరియర్ పరంగా ఎలాంటి డోకా ఉండదని పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు.

 Tamannah To Tell November Story On May 14-TeluguStop.com

సమంతా, కాజల్ అగర్వాల్, తమన్నా, నయనతార డిజిటల్ వరల్డ్ లోకి అడుగు పెట్టేశారు.కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్ అనే హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది.

సమంతా చేసిన ది ఫ్యామిలీ మెన్ 2 మీద భారీ అంచనాలు ఉన్నాయి.త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది.

 Tamannah To Tell November Story On May 14-మేలో నవంబర్ స్టొరీ చెప్పబోతున్న తమన్నా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక తమన్నా రీసెంట్ గా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 11 అవర్స్ అనే వెబ్ సిరీస్ చేసింది.అయితే ఇది ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు.

ఇక ఇప్పుడు తమిళ్ లో ఇంద్ర సుబ్రహ్మణియన్ దర్శకత్వంలో నవంబర్ స్టొరీ అనే వెబ్ సిరీస్ లో నటించింది.ఈ వెబ్ సిరీస్ మే 14న డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ కాబోతుంది.

తండ్రి కూతుళ్ళ అనుబంధం నేపధ్యంలో ఈ కాన్సెప్ట్ ఉంటుందని తెలుస్తుంది.దీంతో తమన్నా ఎంత వరకు మెప్పిస్తుంది అనేది వేచి చూడాలి.

మరో వైపు అహతో తమన్నా మరో వెబ్ సిరీస్ తో పాటు, ఓ టాక్ షో కూడా చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.త్వరలో వీటికి సంబందించిన విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే తమన్నా ప్రస్తుతం నితిన్ మ్యాస్ట్రో సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తుంది.అలాగే ఎఫ్3 మూవీలో వెంకటేష్ కి జోడీగా సీక్వెల్ పాత్రలోనే కొనసాగుతుంది.

మరో రెండు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తుంది.

#Aha App #May 14 #November Story #Tamannah #Hotstar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు