పాకిస్తాన్ క్రికేటర్ ని పెళ్ళి చేసుకోబోతున్న తమన్నా?     2017-09-03   02:08:29  IST  Raghu V

తమన్నా ఫలానా హీరోతో తిరుగుతోందని, ఈ హీరోతో ప్రేమలో పడిందని, ఆ హీరోతో తెగదెంపులు చేసుకుందని .. ఇలాంటి రూమర్లు ఎప్పుడూ వినలేదు. తమన్నా ఇలాంటి విషయాలన్నింటికీ చాలా దూరంగా ఉంటుంది. అందుకే ఇంతవరకూ ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోలేదు. కానీ తమన్నాకి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరం వెళుతోంది. ఈ ఫోటోలో తమన్నా పక్కన ఉన్నది ఒక పాకిస్తాన్ క్రికెటర్ కావడం విశేషం.

సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ లాంటి దిగ్గజాలు ఆడుతున్నప్పుడు మీకు క్రికెట్ చూసే అలవాటు ఉండుంటే అబ్దుల్ రజాక్ ఎవరు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకి ఆల్ రౌండర్ గా దాదాపు 15 ఏళ్లు సేవలందించాడు రజాక్. వన్డేల్లో పాకిస్తాన్ తరఫున 245 మ్యాచులు ఆడిన రజాక్ 2013వ సంవత్సరంలో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

తమన్నాని, రజాక్ ని పక్క పక్కనే ఓ నగల షాపులో చూసి, వీరిద్దరు ప్రేమలో పడ్డారని, పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే నగల షాప్ లో నగలు కొనేందుకు వచ్చారని, ఏవేవో రాసేసారు మీడియావారు. వాస్తవంలోకి వెళితే ఈ ఫోటో ఇప్పటిది కాదు. ఎప్పుడో 2013వ సంవత్సరంలో దుబాయిలోని ఓ నగల షాపు ఓపెనింగ్ కి అతిథులుగా వెళ్ళారు తమన్నా రజాక్. అప్పటి ఫోటో ఇది.

కొత్తగా viral వెళ్లడం వలన ఈ ఫోటో కొత్తదేమో అని పొరబడ్డారు జనాలు. తమన్నాకి రజాక్ తో ఎలాంటి సంబంధం లేదు. నిజానికి ఆ రోజు తరువాత మళ్లీ వారు కలవనే లేదు.