ఆ సినిమా రీమేక్ కోసం ఏకంగా రెండున్నర కోట్లు తీసుకుంటున్న తమన్నా

కన్నడంలో సూపర్ హిట్ అయినా లవ్ మాక్ టైల్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో యుంగ్ హీరో సత్యదేవ్ కి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది.

 Tamannah Take Huge Remuneration For New Movie, Tollywood, Telugu Cinema, Love Ma-TeluguStop.com

చిన్న హీరోతో తమన్నాలాంటి స్టార్ నటించడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది నాగ శేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇక ఇందులో హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.

కథ మొత్తం ఆ పాత్రచుట్టూనే తిరుగుతుంది.దాంతోనే తమన్నా ఆలోచించి ఆ సినిమా సక్సెస్ క్రెడిట్ తన ఖాతాలో పడుతుందని భావించి ఈ సినిమాకి ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.

అదే సమయంలో ఈ సినిమా కోసం తమన్నా కెరియర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం.సినిమాలో నటించడానికి ఏకంగా రెండున్నర కోట్లు ఈ అమ్మడు డిమాండ్ చేసిందని, అంత పెద్ద మొత్తం కూడా ఇవ్వడానికి దర్శక, నిర్మాతలు రెడీ అవ్వడంతోనే తమన్నా ఇందులో చేయడానికి ఆసక్తి చూపించిందని చెప్పుకుంటున్నారు.

మరో వైపు ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు.చిరంజీవి సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుందనే టాక్ వినిపిస్తుంది.అది ఎంత వరకు నిజమో అనేది తెలియదు.ఈ నేపధ్యంలో లవ్ మాక్ టైల్ సినిమా తమన్నాకి అన్ని విధాలుగా ప్లస్ అయ్యే సినిమానే కావడంతో సత్యదేవ్ తో జత కట్టడానికి ఒకే చెప్పినట్లు బోగట్టా

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube