అది జీవితంలో భాగం అయిపొయింది.. తమన్నా!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా.ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

 Tamannah , Heroine, Tollwood, About Life,latest Tollywood News-TeluguStop.com

తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.

తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా నటించింది.బిజీ లైఫ్ లో ఉండే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా సమయాన్ని గడుపుతుంది.ఇదిలా ఉంటే తన జీవితంలో ఒక విషయం బాగా భాగమైందని అంటుంది.

2005లో శ్రీ అనే సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాలో నటించగా.ఈ సినిమా తమన్నా కెరీర్ కు దారి ఇచ్చిందనే చెప్పాలి.అలా వెనుదిరిగి చూడకుండా వరుస సినిమాలతో మంచి సక్సెస్ లతో ముందుకెళ్తుంది.ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.

ఇదిలా ఉంటే వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా తనేంటో నిరూపించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Telugu Gemini Tv, Master Chef, Seetimaar, Tamannah, Tollwood-Movie

త్వరలోనే ఓ రియాలిటీ షోతో ప్రేక్షకుల ముందుకు రానుంది.జెమినీ టీవీలో ప్రసారం కానున్న వంటల ప్రోగ్రాంలో హోస్టింగ్ చేయనుంది.ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కు సంబంధించిన షూటింగ్ పనులు కూడా జరుగుతున్నాయి.మరో రెండు వారాల్లో ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది.ఈ నేపథ్యంలో తమన్నా కొన్ని విషయాలు పంచుకుంటూ.తెలుగు వంటకాలు తన జీవితంలో ఒక భాగం అయిపోయాయని.ఎలా అయితే తెలుగు సినిమాలు తన జీవితంలో భాగమయ్యాయో.

తెలుగు వంటకాలు కూడా తన జీవితంలో భాగమయ్యాయని తెలిపింది.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ గోపీచంద్ తో కలిసి సిటీ మార్ సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాతో పాటు ఎఫ్3, గుర్తుందా శీతాకాలంలో కూడా నటిస్తుంది.ఇక బాలీవుడ్ లో అంధాదున్, బోలె చుడియన్ వంటి వరుస సినిమాలలో నటిస్తుంది.

ఇక నార్తన్ దర్శకత్వంలో మరో సినిమాలో అవకాశం అందుకుంది.అంతేకాకుండా వెబ్ సిరీస్ లలో కూడా బాగా బిజీగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube