తన నడుమందాల సీక్రేట్ చెప్పిన తమన్నా  

హీరోయిన్స్ చాలా స్ట్రిక్ట్ డైట్ మేయింటేన్ చేస్తారు. అంటే ఏ అహారంలో ఎన్ని కాలరీలు ఉంటాయి, షుగర్ లెవెల్స్ ఎంత, ఫ్యాట్స్ ఎంత అని లెక్కలేసుకోని తింటారు అన్నమాట. అందుకే సన్నని నడుముతో కుర్రాళ్ళ మతులు పొగొడుతుంటారు. ఇక తన నడుము అందాల సీక్రేట్ ఎంటీ అని తమన్నాని అడిగితే, మంచి డైట్ అంటోంది. మంచి తిండి తింటే పొట్ట పెరగదు అంటూ సమాధనామిచ్చింది.

నిన్న తమన్నా పుట్టినరోజు కావడంతో ట్విట్టర్ లో అభిమానులతో చాట్ చేస్తూ కాలక్షేపం చేసింది మిల్కీ బ్యూటి. డైట్ బాగా మెయింటేన్ చేసినా, పానిపూరి తన బలహీనత అని, అది తినలేకుండా ఉండలేనని చెప్పింది.

పచ్చడితో తినడం ఇష్టమంట. అందులో ఆవకాయ అంటే తెగ ఇష్టమట. పాటల్లో అర్జిత్ సింగ్ పాటలంటే చెవి కోసుకుంటుందట. ఇక మహేష్ బాబుది మాటల్లో వర్ణించలేని అందమని, బన్ని చాలా మర్యాదపూర్వకంగా ఉంటాడని, ఎన్టీఆర్ టాలెంటెడ్ మనిషి అని తెలుగు హీరోల గురించి కూడా కబుర్లు చెప్పింది.

సో, మీరు తమన్నా లాగే మంచి డైట్ ప్లాన్ చేసుకోని పొట్ట దగ్గర కొవ్వుని కరిగించే పనిలో ఉండండి.