తెలుగులో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా  

Tamannah Green Signal To Act in Web Series, Tollywood, Telugu cinema, Digital Entertainment, OTT Platforms, Praveen Sattaaru - Telugu Digital Entertainment, Ott Platforms, Praveen Sattaaru, Tamannah Green Signal To Act In Web Series, Telugu Cinema, Tollywood

డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవా ప్రస్తుతం కొనసాగుతుంది.థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమా ప్రేక్షకులు ఒటీటీ చానల్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు.

TeluguStop.com - Tamannah Green Signal To Act In Web Series

అక్కడ సినిమాలంటే మంచి కథలు, డిఫరెంట్ జోనర్ వెబ్ సిరీస్ లు వస్తూ ఉండటంతో వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.భవిష్యత్తు అంతా ఒటీటీ చానల్స్ హవానే నడుస్తుందని ఇప్పటికే చాలా మంది ఫిక్స్ అయిపోయారు.

సినిమాలకి ప్రత్యామ్నాయం వెబ్ సిరీస్ లు మాత్రమే అని సెలబ్రిటీలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు.ఓ వైపు ఒటీటీ చానల్స్ ఇప్పటికే కంప్లీట్ అయిన సినిమాల్ని భారీ డబ్బులు వెచ్చించి కొనేస్తున్నారు.

TeluguStop.com - తెలుగులో వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మరో వైపు సెలబ్రిటీలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు చేయడానికి రెడీ అయిపోతున్నారు.హీరోలు ఇంకా ఆ దిశగా అడుగులు వేయకపోయినా హీరోయిన్స్ మాత్రం వెబ్ సిరీస్ లు కూడా చేయడానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.

వెబ్ సిరీస్ లలో అయితే మంచి మంచి పాత్రలు చేయడంతో పాటు రెమ్యునరేషన్ కూడా భాగానే ఉంటుందని హీరోయిన్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.ఇప్పటికే ప్రియమణి, కాజల్, సమంత లాంటి స్టార్స్ వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.

ఇప్పుడు ఇదే దారిలోకి మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేరిపోయింది.ఓ తెలుగు వెబ్ సీరీస్ లో నటించడానికి ఈ భామ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గరుడ వేగ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ వెబ్ సీరీస్ రూపొందనుంది.థ్రిల్లర్ జోనర్ లో ఈ వెబ్ సీరీస్ 8 భాగాలుగా రూపొందుతుందని తెలుస్తోంది.

త్వరలోనే ఈ సీరీస్ షూటింగ్ మొదలవుతుంది.ఈ వెబ్ సిరీస్ తో పాటు ఈ భామ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తుంది.

అందులో తెలుగులో గోపీచంద్ తో సీటీమార్, సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం చిత్రాలతో పాటు హిందీలో బోల్ చుడియాన్ చిత్రంలో నటిస్తోంది.

.

#TamannahGreen #OTT Platforms

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamannah Green Signal To Act In Web Series Related Telugu News,Photos/Pics,Images..