బిగ్ బాస్ నుంచి తమన్నా అవుట్ అయినట్లే  

Tamannah Eliminated In This Weak From Big Boss House-

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ఎన్నడూ లేని విధంగా ఈ సారి కాస్తా ఆసక్తికరంగా నడుస్తుంది.మొదటి, రెండు సీజన్స్ తో పోలిస్తే ఈ సారి కాస్తా బిగ్ బాస్ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటుంది.షో ప్రారంభానికి ముందు కాస్తా వివాదాలలో చిక్కుకున్న బిగ్ బాస్ మొదలైన తర్వాత మంచి ఇంటరెస్టింగ్ గా నడుస్తుంది.హౌస్ లోకి వెళ్ళిన వారిలో చాలా మంది మీద ఆడియన్స్ పాజిటివ్ ఫీలింగ్ తో ఉన్నారు..

Tamannah Eliminated In This Weak From Big Boss House--Tamannah Eliminated In This Weak From Big Boss House-

గత సీజన్ లో కౌశల్ ఆర్మీ మారిది ఫాన్స్ అందరూ ఏకపక్షంగా ఒకరికే మద్దతు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.షోలో ఎక్కువగా కాంట్రవర్సీ క్రియేట్ చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారిని ఆడియన్స్ ఎలిమినేట్ చేసేస్తున్నారు.అలాగే యాక్టివ్ పార్టిసిపేషన్ లేని వారిని కూడా ఆడియన్స్ వోటింగ్ లో బయటకి పంపించేస్తున్నారు.

గత రెండు వారాలలో ఈ పద్దతిలోనే హేమ, జాఫర్ ని బయటకి ఆడియన్స్ పంపించేసారు.

ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఈ వారం ఎలిమినేట్‌ అయ్యిందనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ఇప్పటివరకు ఏ ఇతర కంటెస్టెంట్లకు రానన్ని తక్కువ ఓట్లు తమన్నాకు వచ్చాయని టాక్ వినిపిస్తుంది.

హౌస్‌లో తన ప్రవర్తన, అందరితో అమర్యాదగా ప్రవర్తించడం, ఇతర హౌస్‌మేట్స్‌తో కావాలని గొడవలు పెట్టుకోవడం, అసభ్యకరంగా మాట్లాడటం వలన ఫ్యామిలీ ఆడియన్స్ తమన్నాపై నెగిటివ్ ఒపీనియన్ తో ఉన్నారు.ముఖ్యంగా రవికృష్ణ విషయంలో తమన్నా ప్రవర్తించిన తీరు ఆమె ఎలిమినేషన్‌కు కారణమని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.