బుల్లి తెరపై టిఆర్పీ రేటింగ్స్ యుద్ధం.. తారక్, తమన్నా యుద్ధం

ప్రస్తుతం వెండి తెరకు ధీటుగా క్రేజ్ సంపాదించుకుంది బుల్లితెర.ఇంకా చెప్పాలంటే సినిమా రంగాన్ని తలదన్నే రీతిలో టీవీ రంగం ముందుకు సాగుతుంది.

 Tamannah And Tarak Small Screen War, Tamannah , Tarak , Small Screen , Tollywood , Tamannah Master Chief , Jr Ntr Emk , Tv Shows , Jabardasth Sixth Sense ,-TeluguStop.com

ప్రజలను ఆకట్టుకునేలా పలు కార్యక్రమాలను రూపొందిస్తూ.టీవీకి అతుక్కుపోయేలా చేస్తున్నాయి ఆయా సంస్థలు.

అటు తమ తమ షోలకు మంచి గుర్తింపు తెచ్చుకునేలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి టీవీ యాజమాన్యాలు.అందులో భాగంగానే ఆయా షోలకు సినిమా తారలను హోస్టులుగా తీసుకొచ్చి జనాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు.అటు సినిమా తారల విషయంలోనూ తీర మారుతూ వస్తుంది.ఒకప్పుడు బుల్లితెర మీద కనిపించాలంటేనే చిన్నతనంగా భావించేవారు పలువురు నటీనటులు.టీవీ యాడ్స్ లో నటించడం అన్నా.టీవీ షోలకు హోస్టులుగా చేయాలన్నా నామోషీగా ఫీలయ్యేవారు.

 Tamannah And Tarak Small Screen War, Tamannah , Tarak , Small Screen , Tollywood , Tamannah Master Chief , Jr Ntr Emk , Tv Shows , Jabardasth Sixth Sense , -బుల్లి తెరపై టిఆర్పీ రేటింగ్స్ యుద్ధం.. తారక్, తమన్నా యుద్ధం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమా పరిశ్రమ నుంచి ఫేడౌట్ అయిన సినిమా తారలు మాత్రమే టీవీ తెరలపై కనిపించేవారు.కానీ ప్రస్తుతం పలు షోలకు క్రేజీ హీరోలు, హీరోయిన్లు హోస్టులగా కనిపిస్తున్నారు.

తాజాగా మీలో ఎవరు కోటేశ్వరులు షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా చేస్తుండగా.మాస్టర్ చెఫ్ షోకు మిల్కీబ్యూటీ తమన్నా హోస్టుగా కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో ఏవరి షో.ఏంత రేటింగ్ సంపాదించింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు టీవీ పరిశ్రమలో చలా కాలంగా చక్కటి రేటింగ్ సాధిస్తున్న షో జబర్దస్త్.మల్లెమాల ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ షో ఈ వారం కూడా బ్రహ్మాండమైన రేటింగ్ సంపాదించింది.సిటీలో 6.45, గ్రామాల్లో 6.49 రేటింగ్ నమోదు చేసింది.అటు స్టార్ మాలో ప్రసారం అవుతున్న సిక్స్త్ సెన్స్ షో గ్రామాల్లో 5.44, సిటీలో 4.78 రేటింగ్ సాధించింది.

Telugu Jabardasthsixth, Jr Ntr Emk, Small Screen, Tamannah, Tamannah Master, Tarak, Tollywood, Tv Shows-Telugu Stop Exclusive Top Stories

జనాల్లో ఫుల్ క్రేజ్ సంపాదించిన ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షో మాత్రం అనుకున్నంత స్థాయిలో రేటింగ్ రావట్లేదు.తొలి రోజు 11 రేటింగ్ సాధించిన ఈ షో.వారం గడిచే సరిక 4.82కు ప‌డిపోయింది.మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హోస్టుగా చేస్తున్న మాస్ట‌ర్ చెఫ్‌ సైతం రేటింగ్ లో అంతంత మాత్రంగానే ఉంది.ఈ షోకు కేవలం 4.64 శాతం రేటింగ్ వ‌చ్చింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube