ఆచార్యలో మరో బ్యూటీ.. చిరు కోసం కాదట!

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రం కూడా ఒకటి.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో చిరు మరోసారి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు.

 Tamannaah To Romance Charan In Acharya, Tamannaah, Acharya, Ram Charan, Koratala-TeluguStop.com

కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తికాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా చిత్ర షూటింగ్ వాయిదా పడింది.ఇక ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కేమియో పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్ కేమియో పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది.ఇందులో భాగంగా చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో నటిస్తాడని, ఆయనకు జోడీగా హీరోయిన్ కూడా ఉంటుందని చిత్ర వర్గాల టాక్.

 Tamannaah To Romance Charan In Acharya, Tamannaah, Acharya, Ram Charan, Koratala-TeluguStop.com

కాగా చరణ్‌కు జోడీగా ఎవరు నటిస్తారనే అంశంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.తొలుత బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అటుపై కీర్తి సురేష్ పేర్లు వినిపించినా అవి గాలివార్తలే అని తేలింది.

దీంతో గతంలో చరణ్‌తో కలిసి రచ్చ సినిమాలో నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా, ఇటీవల సైరా నరసింహారెడ్డి చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితోనూ నటించింది.

ఇప్పుడు ఆమెను ఈ సినిమాలో కేమియో పాత్రలో నటింపజేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మెగా పవర్ స్టార్‌తో మంచి రిలేషన్ ఉన్న తమన్నా కూడా ఈ పాత్రలో నటించేందుకు ఓకే అన్నట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఈ సినిమాను చరణ్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube