తమన్నా అలాంటి పాత్రలు ఎంచుకోడానికి కారణమిదే!

గత దశాబ్ద కాలం నుంచి చిత్రసీమలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని దక్షిణాది అగ్ర కథానాయికలలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన కమర్షియల్ చిత్రాలలో మాత్రమే కాకుండా లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటించడమే కాకుండా వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

 Tamannaah Something New In The Choice Of Characters-TeluguStop.com

అలాగే కొన్ని సినిమాలలో ప్రత్యేక పాటలతో అందరిని అలరింప చేశారు.

ఇలా వివిధ విభిన్న పాత్రలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులను సందడి చేస్తున్న తమన్నా తాజాగా నితిన్ హీరోగా నటించినటువంటి మాస్ట్రో చిత్రంలో నెగిటివ్ పాత్రలో నటించారు.

 Tamannaah Something New In The Choice Of Characters-తమన్నా అలాంటి పాత్రలు ఎంచుకోడానికి కారణమిదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా ఇన్ని రోజులు గ్లామరస్ పాత్రలో ప్రేమ కథా చిత్రాలలో అందరినీ సందడి చేసిన తమన్నా ఒక్కసారిగా నెగిటివ్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను కొంత ఆశ్చర్యానికి గురి చేశారు.

తమన్నా ఇలాంటి పాత్రలను ఎంపిక చేసుకోవడానికి గల కారణం ఏమిటనే విషయాలను ఓ సందర్భంలో తెలియజేశారు.

ఓ నటిగా సవాళ్లను స్వీకరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని.మనం మన పరిధిని దాటి మంచి గుర్తింపు సంపాదించుకోవాలంటే ఈ విధమైనటువంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించాలని తమన్నా పేర్కొన్నారు.

ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.మాస్ట్రో చిత్రం ద్వారా నెగిటివ్ పాత్రలో కనిపించిన తమన్నా నటన పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని చెప్పవచ్చు.

#Maestro #Tamannaah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు