టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోయిన్గా తన సత్తా చాటుకున్న విషయం తెలిసిందే.ఆమె ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం సీటీమార్ అనే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో నటిస్తున్న తమన్నా, ఇతర భాషల్లోనూ కొన్ని సినిమాలను క్యూలో పెట్టింది.
ఇక ప్రస్తుతం డిజిటిల్ ప్లాట్‌ఫాంలపై తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లకు భారీ డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.
అయితే తమన్నా కూడా ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.ఇప్పటికే తమన్నా సదరు వెబ్ సిరీస్‌లో నటిస్తుందని, షూటింగ్లో కూడా జాయిన్ అయ్యిందని వార్తలు వినిపించాయి.
కాగా ‘నవంబర్ స్టోరీస్’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌లో తండ్రికూతుళ్ల మధ్య నడిచే డ్రామాను మనకు చూపించనున్నారు.అయితే ఈ వెబ్‌సిరీస్ ఎప్పుడో ప్రారంభమైందని, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదని తెలుస్తోంది.
దీంతో ఈ వెబ్‌సిరీస్ అసలు ఉందా లేదా, ఉంటే తమన్నా నటిస్తుందా లేక వాకౌట్ చేసిందా అనేది ఆసక్తికరంగా మారింది.ఇక నవంబర్ సిరీస్ వెబ్ సిరీస్‌ను రామ్ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేస్తుండగా హాట్‌స్టార్‌పై దీన్ని ప్రసారం చేయడానికి నిర్వాహకులు రెడీ అవుతున్నారు.
ప్రముఖ తమిళ లీడింగ్ వీక్లీ మేగజైన్ ఆనంద్ వికటన్ ఈ వెబ్ సిరీస్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.మరి ఈ వెబ్ సిరీస్‌లో తమన్నా ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక సినిమాల పరంగా తమన్నా త్వరలోనే కన్నడ స్టార్ హీరో యశ్‌తో కలిసి ఓ సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది.