ఇంటికే షూటింగ్ లొకేషన్ మార్చేసుకున్న తమన్నా  

Tamannaah Shooting Started in Home, Tollywood, Telugu Cinema, South India Heroines, Rashmika Mandanna, Tamannaah,shooting location - Telugu Rashmika Mandanna, South India Heroines, Tamannaah, Tamannaah Shooting Started In Home, Telugu Cinema, Tollywood

కరోనా లాక్ డౌన్ అనంతరం అందాల భామలు అందరూ షూటింగ్ కి సిద్ధమయ్యారు.ఆరు నెలల గ్యాప్ తర్వాత షూటింగ్ లకి సిద్ధం కావడంతో చాలా ఉత్సాహంగా ఉన్నారు.

TeluguStop.com - Tamannaah Shooting Started In Home

వారి ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి.పూజా హెగ్డే ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా స్టార్ట్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది.

అలాగే రష్మిక మందన కూడా పుష్ప సినిమా షూటింగ్ కి రెడీ అయ్యింది.ఇక మిగిలిన భామలు కూడా యాడ్స్, సినిమాలు షూటింగ్ చేసుకుంటున్నారు.

TeluguStop.com - ఇంటికే షూటింగ్ లొకేషన్ మార్చేసుకున్న తమన్నా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కోవిడ్ నిబంధనలు అనుసరించే షూటింగ్ లో పాల్గొంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే దారిలో తమన్నా కూడా చేరిపోయింది.

తాజాగా ఈ భామ కూడా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసింది.అయితే షూటింగ్ కోసం బయటకి వెళ్ళకుండా తన ఇంటినే లొకేషన్ గా మార్చేసుకుంది.

అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే షూటింగ్‌ చేశారు.

ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు.

అయితే దేనికి సంబంధించిన షూటింగ్‌ అనేది చెప్పలేదు.షూటింగ్‌ అనంతరం తమన్నా ఇంట్లో రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేశారు.

షూటింగ్‌ని, సెట్స్‌ని చాలా మిస్‌ అవుతున్నా.ఓ షూట్‌ కోసం ముంబైలోని మా ఇల్లే సెట్‌లా మారింది.

అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ టీమ్‌ అంతా పనిచేశాం.కెమెరా ముందుకెళ్లగానే ఎంతో ఉత్సాహం వచ్చింది అని తమన్నా తెలిపారు.

మొత్తానికి షూటింగ్ కోసం బయటకి వెళ్ళకుండా ఇంట్లోనే షూటింగ్ మొదలు పెట్టింది.ఇదిలా ఉంటే సత్యదేవ్ తో చేయబోయే సినిమా షూటింగ్ కోసం త్వరలో ఈ అమ్మడు హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

మరి తమన్నా నుంచి షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ దొరకడంతో ఆ చిత్ర నిర్మాతలు కూడా షూటింగ్ షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు.

#SouthIndia #Tamannaah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamannaah Shooting Started In Home Related Telugu News,Photos/Pics,Images..