ఏం చేయాలో మాకు తెలుసంటూ సీరియస్ అయిన తమన్నా

సెలబ్రిటీలు అంటే వారికి కోట్ల రూపాయిల ఆదాయం వస్తుందని, ఖరీదైన లైఫ్ జీవిస్తూ ఉంటారని అందరూ భావిస్తూ ఉంటారు.హీరోలకి రెండు కోట్ల నుంచి 70 కోట్ల వరకు వారి రేంజ్ బట్టి రెమ్యునరేషన్ రూపంలో వస్తుంది.

 Tamannaah Serious On Netizens Trolling On Corona Help, Tollywood, Sonu Sood, Cel-TeluguStop.com

అలాగే హీరోయిన్స్ కి కూడా 50 లక్షల నుంచి 10 కోట్ల వరకు ఒక్కో సినిమాకి వాళ్ళ స్టార్ ఇమేజ్ బట్టి రెమ్యునరేషన్ గా ఇస్తూ ఉంటారు.ఇంత పెద్ద మొత్తంలో వారికి ఆదాయం వస్తూ ఉండటంతో పాటు యాడ్స్ ద్వారా కూడా హీరోయిన్స్ భారీగా ఆర్జిస్తూ ఉంటారు.

ఈ నేపధ్యంలో దేశంలో ఏదైనా విపత్తు వస్తే ముందుగా సహాయం చేయడంలో సెలబ్రిటీలు ముందు వరుసలో ఉంటూ వారికి తోచినస్థాయిలో విరాళంగా అందిస్తూ ఉంటారు.అయితే కొంత మంది ఎలాంటి ప్రచారం లేకుండా తమకి చేతనైన సాయం ఏదో ఒక రూపంలో చేస్తారు.

అయితే సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో కరోనా విపత్తులో బయటకొచ్చి ప్రజలకి సహాయం చేయడం లేదంటూ సెలబ్రేటీలని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.విమర్శించే స్వేచ్చ ఉంది కదా అని స్టార్ హీరోలని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ సోనూసూద్ బయటకొచ్చి ప్రజలకి సేవ చేస్తూ ఉంటే కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ తీసుకుంటున్న రీల్ హీరోలు మాత్రం కష్టకాలంలో ఇంట్లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

Telugu Charity, Corona, Corona Pandemic, Sonu Sood, Tamannaah, Tollywood-Movie

ప్రజల సొమ్ముతో బ్రతుకుతూ ప్రజల కష్టాన్ని పట్టించుకోవడం లేదని ట్రోల్ చేస్తున్నారు.సోనూసూద్ రియల్ హీరో అంటూ స్టార్ హీరోలు అందరూ అసలు హీరోలే కాదంటూ ఇష్టారీతిలో కామెంట్స్ చేస్తున్నారు.అలాగే హీరోయిన్స్ కి కూడా ఈ విమర్శల ట్రోలింగ్ తప్పడం లేదు.కొంత మంది డైరెక్ట్ గా వారి అఫీషియల్ ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ లోకి వెళ్లి మరీ కామెంట్స్ చేస్తున్నారు.

దీనిపై తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నా రియాక్ట్ అయ్యింది.మేమంతా మా స్థాయిలో సహాయం చేస్తూనే ఉన్నాం.నిజంగా ఏది అవసరమో అది మేమంతా చేస్తున్నాం.నా వరకు నేనైతే చేసిన సహాయాన్ని చెప్పుకోను.

కొంతమంది మాత్రం మరింత మందికి స్ఫూర్తిని ఇచ్చేందుకు చేసిన సహాయాన్ని చెప్పుకుంటారు.సయం చేయడం లేదని సెలబ్రిటీల్ని తప్పుపట్టడం సరికాదని, తనకు తెలిసిన వారంతా ఈ కరోనా టైమ్ లో సహాయ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారని తెలిపింది.

సెలబ్రిటీలపై ఎప్పుడూ ఈ ఒత్తిడి ఉంటూనే ఉంటుందని ప్రతిది బయటకు చెప్పాలని అంతా కోరుకుంటారు.కానీ నాలాంటి వాళ్లు కూడా ఉంటారు.

చేసింది బయటకు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు.సెలబ్రిటీలని విమర్శించే ముందు మీరు ఏం చేస్తున్నారో అనే విషయాన్ని కూడా గ్రహిస్తే మంచింది అంటూ తమన్నా ట్రోలర్స్ పై సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube