యష్ సెకండ్ పాన్ ఇండియా మూవీ హీరోయిన్ గా తమన్నా

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కేజీఎఫ్ సిరీస్ తో ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు అతని ఇమేజ్ ఇండియా వైడ్ గా ఉంది.

 Tamannaah Romance With Yash His Next Movie-TeluguStop.com

ప్రభాస్ తర్వాత ఆ ఫీట్ ని అందుకున్న సౌత్ హీరో యష్ అనే చెప్పాలి.ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా మూవీలు చేస్తున్న ప్రభాస్ కి ఉన్న రేంజ్ లో కేవలం యష్ కి మాత్రమే ఇండియన్ వైడ్ ఇమేజ్ ఉంది.

ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే చాప్టర్ 2 రిలీజ్ తర్వాత యష్ చేయబోయే మూవీ ఏంటి అనే విషయం చాలా రోజుల నుంచి సస్పెన్స్ నడుస్తుంది.

 Tamannaah Romance With Yash His Next Movie-యష్ సెకండ్ పాన్ ఇండియా మూవీ హీరోయిన్ గా తమన్నా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలా మంది టాలీవుడ్ దర్శకులు యష్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు.వీరిలో పూరి జగన్నాథ్ కూడా ఉన్నాడు.

పూరికి యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా టాక్ ఉంది.అయితే అంతకంటే ముందుగా మరో దర్శకుడుతో యష్ సినిమా చేయబోతున్నాడు.

Telugu Director Narthan, Hero Yash, Kgf Chapter 2 Movie, Mufti Movie, Shivaraj Kumar, Tamannaah-Movie

కన్నడ ఇండస్ట్రీలో మఫ్టీ అనే సినిమాతో దర్శకుడుగా మారిన నార్తన్ దర్శకత్వంలో యష్ నెక్స్ట్ సినిమా చేయడానికి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.శివరాజ్ కుమార్ హీరోగా నటించిన మఫ్టీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఇప్పుడు రెండో సినిమానే నార్తన్ ఏకంగా కేజీఎఫ్ స్టార్ యష్ తో పాన్ ఇండియా రేంజ్ లోనే మూవీ చేయబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ మూవీ ఆగష్టులో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇక ఈ మూవీ హీరోయిన్ గా టాలీవుడ్ బ్యూటీ తమన్నాని ఫైనల్ చేసినట్లు టాక్.ఇప్పటికే దర్శకుడు ఆమెకి కథ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తుంది.రాకింగ్ స్టార్ నెక్స్ట్ సినిమాని డైరెక్ట్ చేయడం ద్వారా నార్తన్ పేరు ఇప్పుడు ఒక్కసారిగా అందరి దృష్టిలో పడింది.అయితే ప్రశాంత్ నీల్ తరహాలోనే ఇతను కూడా ఒక్క సినిమా అనుభవంతోనే పాన్ ఇండియా రేంజ్ లో మూవీ చేయబోతూ ఉండటం విశేషం.

#Shivaraj Kumar #KGFChapter #Tamannaah #Hero Yash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు