రెమ్యునరేషన్ విషయంలో అంత సీన్ లేదు అంటున్న తమన్నా

సినిమా ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్ ఎంత పెరిగిన కూడా ఎవరూ పట్టించుకోరు.అయితే హీరోయిన్స్ విషయంలో మాత్రం సినిమాలు హిట్ అయ్యి మార్కెట్ పెరిగి తమ రెమ్యునరేషన్ పెంచితే పెద్దగా గగ్గోలు పెడతారు.

ఈ హీరోయిన్ రెమ్యునరేషన్ పెంచేసింది అంటూ ప్రచారం చేస్తారు.అయితే ఇలాంటి ప్రచారానికి కొంత మంది భామలు ఆదిలోనే ఫుల్ స్టాప్ పెడతారు.

తనకి డిమాండ్ ఉంది కాబట్టి రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్న అని క్లారిటీగా చెబుతారు.

సెలబ్రిటీలు ఎవరైనా కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతారు.క్రేజ్ ఉన్నప్పుడు తమ మార్కెట్ రేంజ్ బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు.

నిర్మాతలు కూడా ఒక్కోసారి వారు అడిగినంత ఇవ్వడానికి ఒకే చెబుతారు.లేదంటే మీ మార్కెట్ ఇంత ఉంది కాబట్టి ఇంతే ఇస్తాం అని చెబుతారు.

ఈ విషయంపై తమన్నా కూడా క్లారిటీ ఇచ్చింది.తాను ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఈ మధ్య గాసిప్స్ వినిపించడంతో వాటిపై స్పందించింది.

తాను అడిగినంత ఇవ్వకపోవడంతో ఓ చిత్రంలో నటించడానికి తమన్నా నిరాకరించిందంటూ వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

మనం అడిగినంతా ఏ నిర్మాత కూడా ఇవ్వరు.మనకు ఎంత మార్కెట్ వుందో అంతే ఇస్తారు.

అలాంటప్పుడు నేనెందుకు ఎక్కువ అడుగుతాను? ఇవన్నీ అర్థం పర్థం లేని పుకార్లు అంటూ కొట్టిపారేసింది.

అయితే హీరోయిన్స్ చెప్పిన కూడా కొంత అదే పనిగా ఇలాంటి ప్రచారం చేస్తూ ఉంటారు.

మొత్తానికి తమన్నా వాఖ్యల బట్టి ప్రస్తుతం తన మార్కెట్ కి తగ్గట్లుగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు స్పష్టం అయ్యింది.

ఏలూరు జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత