జక్కన్నపై తమన్నా కామెంట్.. రెండో ఛాన్స్ అందుకే ఇవ్వడట!  

Tamannaah Comments On Rajamouli, Tamannaah, Rajamouli, RRR, Baahubali - Telugu Baahubali, Rajamouli, Rrr, Tamannaah

టాలీవుడ్ స్టార్ బ్యూటీ తమన్నా దశాబ్ధ కాలంగా తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతూ వస్తోంది.ఇప్పటికీ చెక్కుచెదరని అందం ఆమె సొంతం.

 Tamannaah Rajamouli Rrr

కాగా ఈ బ్యూటీ తన అందంతో పాటు అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.ఇక ఈ బ్యూటీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో నటించిన ఈ బ్యూటీ, ఆ సినిమాలోని మొదటి భాగంలో కీలక పాత్రలో నటించింది.

ఇక ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, తాజాగా రాజమౌళిపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.‘‘రాజమౌళి సినిమాల్లో ఒకసారి నటించిన వారికి రెండో ఛాన్స్ దక్కిందంటే అది వారి అదృష్టంగా భావించాలి.

జక్కన్నపై తమన్నా కామెంట్.. రెండో ఛాన్స్ అందుకే ఇవ్వడట-Gossips-Telugu Tollywood Photo Image

సాధారణంగా రాజమౌళి ఒకసారి చేసిన హీరోహీరోయిన్లను తిరిగి తన సినిమాల్లో చేయించుకున్న దాఖలాలు చాలా తక్కువ.ఒకవేళ అలా గనక వారు నటించారంటే అది ఖచ్చితంగా వారి కోసమే రాసుకున్న కథ అయ్యి ఉంటుంది’’ అంటూ తమన్నా కామెంట్ చేసింది.

ఈ కామెంట్‌పై నెటిజన్లు ప్రస్తుతం మిశ్రమంగా స్పందిస్తున్నారు.తమన్నా చేసిన కామెంట్స్‌తో చాలా మంది ఏకీభవిస్తున్నా, కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

రాజమౌళి చాలా మందితో రెండు సినిమాలు చేశాడంటూ వారు అంటున్నారు.ఇక సీటీమార్ చిత్రం తనకు మంచి పేరును తీసుకొస్తుందని తమన్నా ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ సినిమాలో హీరో గోపీచంద్ నటిస్తోండగా సంపత్ నంది డైరెక్ట్ చేస్తున్నాడు.

#Rajamouli #Tamannaah #RRR #Baahubali

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamannaah Rajamouli Rrr Related Telugu News,Photos/Pics,Images..