విశాల్ కి విలన్ గా మారుతున్న మిల్కీ బ్యూటీ  

Tamannaah Play Negative Role In Vishal Movie-

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం మళ్ళీ ఫాంలోకి వచ్చింది.తెలుగులో ఎఫ్2తో సూపర్ హిట్ కొట్టిన ఈ భామ ముదురు హీరోలకి జోడీగా కూడా ఒకే అనడంతో సీనియర్ హీరోల సరసన ఈ అమ్మడుని నటింపచేయడానికి నిర్మాతలు రెడీ అయిపోతున్నారు.

Tamannaah Play Negative Role In Vishal Movie-

ప్రస్తుతం సైరా సినిమాలో చేస్తున్న ఈ భామ తెలుగులో ఓంకార్ దర్శకత్వంలో హర్రర్ కామెడీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ప్రస్తుతం టాలీవుడ్ లో అయితే ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఈ రెండే.


ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళంలో ఈ అమ్మడు మరో క్రేజీ ఆఫర్ పట్టేసింది అని తెలుస్తుంది.విశాల్ హీరోగా ప్రస్తుతం టెంపర్ రీమేక్ తెరకెక్కుతుంది.దీని తర్వాత విశాల్ ఓ కొత్త దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇది డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కుతుంది అని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో విశాల్ కి విలన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా నటించబోతున్నట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని ఆమె ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా చెప్పుకొచ్చింది.

అయితే ఇందులో విశాల్ కి ఇంకో హీరోయిన్ ఉంటుందా, లేక నెగిటివ్ షేడ్స్ లో ఉన్న హీరోయిన్ గానే తమన్నా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.ఇప్పటికే రెండు సినిమాలలో విశాల్ తో ఆడిపాడిన ఈ భామ ఇది మూడో సినిమా అని చెప్పాలి.

.

తాజా వార్తలు