తండ్రిని రక్షించుకోవడానికి హ్యాకర్ అనురాధగా మారిన తమన్నా

స్టార్ హీరోయిన్ తమన్నా ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అహలో 11 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో తమన్నా తండ్రి బాద్యతలని తీసుకొని వ్యాపారంలోకి అడుగుపెట్టే ఒక బిజినెస్ విమెన్ పాత్రలో కనిపించింది.

 Tamannaah Play Hacker Anuradha Role In November Story, Digital Entertainment, H-TeluguStop.com

ఇక వెబ్ సిరీస్ లో ఆమె పాత్రకి భాగానే న్యాయం చేసిన అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళంలో నవంబర్ స్టొరీ అనే వెబ్ సిరీస్ లో నటించింది.

ఈ వెబ్ సిరీస్ లో ఈ నెల 14న డిస్నీ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కాబోతుంది.ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ని హాట్ స్టార్ వారు వదిలారు.

ఇక ఇందులో తమన్నా ఇథికల్ హ్యాకర్ అనురాధ పాత్రలో కనిపిస్తుంది.

ఒక హత్యా నేరంలో ఇరుక్కున్న తన తండ్రిని రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేసే అమ్మాయిగా పూర్తి భావోద్వేగాలతో అనురాధ పాత్రని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.

తండ్రి కోసం ఆమె ఎలాంటి పోరాటం చేసింది అనేది కథనంలో చూపించబోతున్నారు.పూర్తి తమిళ్ టచ్ లోనే అనురాధ పాత్రని దర్శకుడు సుబ్రహ్మణియన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

మొదటి వెబ్ సిరీస్ తో డిజిటల్ ప్రేక్షకులని మెప్పించలేకపోయిన ఎమోషనల్ ఎలిమెంట్స్ తో సాగే ఈ వెబ్ సిరీస్ తో మాత్రం తమన్నా అందరికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.ఇదిలా ఉంటే తమన్నా ప్రస్తుతం ఎఫ్3 మూవీతో పాటు నితిన్ మ్యాస్ట్రో సినిమాలలో నటిస్తుంది.

వీటితో పాటు హిందీలో కూడా వెబ్ సిరీస్ కోసం ఈమెని సంప్రదిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube