మిల్కీ బ్యూటీతో వకీల్ సాబ్ రొమాన్స్.. మామూలుగా ఉండదట!  

Tamannaah To Romance Pawan Kalyan In Vakeel Saab, Tamannaah, Pawan Kalyan, Vakeel Saab, Pink Remake - Telugu Pawan Kalyan, Pink Remake, Tamannaah, Vakeel Saab

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకునేందుకు పవన్ రెడీ అవుతున్నాడు.

 Tamannaah Pawan Kalyan Vakeel Saab

కాగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఈ సినిమాతో పవన్ అదిరిపోయే రీఎంట్రీ ఇస్తాడని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్‌లుగా నివేదా థామస్, అంజలి నటిస్తున్నారు.అయితే బాలీవుడ్‌లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన లాయర్ పాత్రలో పవన్ కనిపిస్తాడు.కానీ పవన్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా భారీ మార్పులు చేస్తున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్.ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ పాత్ర అదనంగా ఉండనుంది.

మిల్కీ బ్యూటీతో వకీల్ సాబ్ రొమాన్స్.. మామూలుగా ఉండదట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో పవన్ సరసన రొమాన్స్ చేసే ఆ బ్యూటీ ఎవరనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.కాగా ఈ సినిమాలో తొలుత పవన్ సరసన శృతి హాసన్ పేరు వినిపించినా, ఆమె ఈ సినిమాలో నటించడం లేదని తెలుస్తోంది.

ఇక దీంతో ఇప్పుడు ఈ సినిమాలో పవన్‌తో రొమాన్స్ చేసేందుకు మిల్కీ బ్యూటీ తమన్నాను చిత్ర యూనిట్ సంప్రదించిందని, ఆమె కూడా ఈ సినిమాలో నటించేందుకు వెంటనే ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది.గతంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాలో పవన్ సరసన తమన్నా రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరోసారి పవన్‌తో రొమాన్స్‌కు తమన్నా రెడీ కావడంతో ఈ సినిమాలో వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

#Pink Remake #Tamannaah #Pawan Kalyan #Vakeel Saab

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamannaah Pawan Kalyan Vakeel Saab Related Telugu News,Photos/Pics,Images..