సిమి పాత్ర తనకి చాలెంజింగ్ అంటున్న తమన్నా  

Tamannaah opens up on her role in Andhadhun remake, Tollywood, Telugu Cinema, Andhadhun Remake, Hero Nithiin, Tamannaah - Telugu Andhadhun Remake, Hero Nithiin, Tamannaah, Tamannaah Opens Up On Her Role In Andhadhun Remake, Telugu Cinema, Tollywood

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దం పాటు తిరుగులేని హవా కొనసాగించిన మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ట్రాక్ మారుస్తుంది.రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రల జోలికి వెళ్లకుండా తన ప్రత్యేకత కనిపించే విధంగా సినిమాలని ఎంపిక చేసుకుంటుంది.

TeluguStop.com - Tamannaah Opens Up On Her Role In Andhadhun Remake

సైరా, బాహుబలి సినిమాలో ఆమె చేసిన పాత్రలకి మంచి గుర్తింపు వచ్చింది.ఆమె పాత్రలు చూసిన తర్వాత తమన్నాలో ఇంత గొప్ప నటి ఉందా అని అందరూ ఆశ్చర్యపోయే రేంజ్ లో నటించింది.తరువాత కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తుంది.ఎఫ్2 లో వెంకటేష్ కి జోడీగా నటించిన అందులో తమన్నా పాత్ర చాలా పవర్ ఫుల్ ఎంటర్టైన్ గా ఉంటుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె తెలుగులో సత్యదేవ్ తో చేస్తున్న సినిమా, అలాంగే హిందీ సినిమాలో మంచి పాత్రలు చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ అంధాదున్ తెలుగు రీమేక్ లో టబు నటించిన పాత్రకి ఎంపికైంది.

TeluguStop.com - సిమి పాత్ర తనకి చాలెంజింగ్ అంటున్న తమన్నా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నితిన్ హీరోగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఆమె చేయబోయేది పూర్తి స్థాయి నెగిటివ్ రోల్.హిందీలో ఆ పాత్ర చేసిన టబు జాతీయ ఉత్తమ సహాయనటి అవార్డు అందుకుంది.

ఇప్పుడు ఇదే పాత్రని తెలుగులో తమన్నా చేస్తూ ఉండటంతో చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.సిమి పాత్ర నాకు చాలా చాలెంజింగ్ అని, ఆ పాత్రలో నన్ను నేను చూసుకోవడం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.

జాతీయ స్థాయి అవార్డు గెలుచుకున్న పాత్ర కావడంతో దాని మీద అంచనాలు ఉంటాయని, వాటిని అందుకోవడానికి ప్రయత్నం చేస్తానని తమన్నా చెప్పినట్లు తెలుస్తుంది.మరి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ కెరియర్ లో దూసుకుపోతున్న తమన్నాకి ఈ రీమేక్ ఎంత వరకు గుర్తింపు తెస్తుంది అనేది చూడాలి.

#Tamannaah #TamannaahOpens #Hero Nithiin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamannaah Opens Up On Her Role In Andhadhun Remake Related Telugu News,Photos/Pics,Images..