అందుకే అలాంటి పాత్రలు అంటోన్న తమన్నా!  

Tamannaah On Doing Bold Roles, Tamannaah, Nithiin, Andhadhun Remake, Bold Roles, Tollywood News - Telugu Andhadhun Remake, Bold Roles, Nithiin, Tamannaah, Tollywood News

మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్ద కాలంగా టాప్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.అమ్మడు గ్లామర్ రోల్స్‌తో పాటు నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో కూడా తనదైన మార్క్ వేసుకుని టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

TeluguStop.com - Tamannaah On Doing Bold Roles

అయితే కొత్త ట్యాలెంట్‌కు దర్శకనిర్మాతలు, హీరోలతో పాటు ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతుండటంతో, తమన్నాకు ప్రస్తుతం హీరోయిన్ అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి.ఈ విషయాన్ని స్వయంగా తమన్నానే ఒప్పుకోవడం విశేషం.
ఏ ఇండస్ట్రీలోనైనా కొత్త ట్యాలెంట్‌కు ఎప్పుడు ఆదరణ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది.ఈ క్రమంలోనే హీరోయిన్‌గా అవకాశాలు వచ్చిన ప్రతిసారీ అమ్మడు ఏమాత్రం సందేహం లేకుండా ఓకే చేస్తోందట.

అంతేగాక ఐటెం సాంగ్స్, కేమియో రోల్స్ ఇలా ఎలాంటి ఆఫర్ వచ్చినా తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది.తాజాగా యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ‘అంధాధున్’ చిత్ర రీమేక్‌లోనూ తమన్నా బోల్డ్ పాత్రలో నటించేందుకు ఒప్పేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

TeluguStop.com - అందుకే అలాంటి పాత్రలు అంటోన్న తమన్నా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ సినిమా హిందీలో వర్షన్‌లో టబూ చేసిన పాత్రను తమన్నా చేయబోతుంది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకంటే కూడా ఎక్కువ ప్రాధాన్యత తమన్నాకే ఉండనుందనేది వాస్తవం.

ఇక ఈ సినిమాలో బోల్డ్ సీన్స్‌తో పాటు లిప్‌లాక్‌లు కూడా ఉండబోతున్నాయి.దీంతో ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ ఎలా రెచ్చిపోతుందా అని ఆమె ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని, లైమ్‌లైట్‌లో ఉండటమే కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి తమన్నా ఆసక్తి చూపుతుంది.ఏదేమైనా తమన్నా ఫేడవుట్ కాకముందే ఇలా నిజాన్ని ఒప్పుకుని, వచ్చిన ఆఫర్స్ చేసుకోవడం అభినందించతగ్గ విషయమని పలువురు సినీ విమర్శకులు అంటున్నారు.

ఏదేమైనా అంధాధున్ రీమేక్‌లో తమన్నా నటిస్తుందనే వార్తతో మరోసారి మిల్కీ బ్యూటీ వార్తల్లో నిలిచింది.

#Nithiin #Tamannaah #Bold Roles

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamannaah On Doing Bold Roles Related Telugu News,Photos/Pics,Images..