స్టార్ ఇమేజ్ అనేది నటనలో బోనస్ మాత్రమే అంటున్న తమన్నా

శ్రీ అనే సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టి తరువాత్ హ్యాపీడేస్ తో మొదటి హిట్ ని తన ఖాతాలో వేసుకొని తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన అందాల భామ తమన్నా.స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ పదేళ్ళ కాలంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని తన నటన, డాన్స్ టాలెంట్ తో తమన్నా సొంతం చేసుకుంది.

 Tamannaah Interesting Comments On Star Status, November Story, Web Series, F 3 M-TeluguStop.com

ప్రస్తుతం కూడా వరుస సినిమాలతో ఈ భామ తన హవా కొనసాగిస్తుంది.ప్రస్తుతం తమన్నా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయంటేనే ఆమె స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఈ మధ్య డిజిటల్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ అప్పుడే రెండు వెబ్ సిరీస్ లు చేసేసింది.తాజాగా తమన్నా తన డిజిటల్ ప్రయాణం, హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అందుకోవడంపై ఆసక్తికర వాఖ్యలు చేసింది.

డిజిటల్‌ వేదికలు నటిగా ప్రతిభాసామర్థ్యాల్ని ఆవిష్కరించుకోవడానికి గొప్ప మాధ్యమాలుగా భావిస్తా.ఇక్కడ కొత్త కథల్ని, ప్రయోగాత్మక ఇతివృత్తాల్ని ఎంచుకునే అవకాశముంటుంది.భవిష్యత్తులో మరిన్ని వినూత్న కాన్సెప్ట్ లని ఎంచుకొని వెబ్‌సిరీస్‌లు చేస్తాను అని చెప్పింది.ఓటీటీల్లో నటించడం వల్ల కథానాయికగా స్టార్‌డమ్‌ దెబ్బతింటుంది కదా అనే ప్రశ్నకు నటించడం వరకే మన చేతిలో ఉంటుంది.

స్టార్‌డమ్‌ ప్రేక్షకులు అందించే వరం.నా నియంత్రణలో లేని విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించను.ప్రతిభకు గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వస్తే వాటిని బోనస్‌గా భావిస్తా అని ఆసక్తికర వాఖ్యలు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube