కథ నచ్చితే గెస్ట్ రోల్ అయినా ఓకే అంటున్న తమన్నా  

Tamannaah Interested on Special Roles, Tollywood, Telugu Cinema, Seeti Maar Movie, Andhadhun Remake, Tollywood Heroines, Tamannaah - Telugu Andhadhun Remake, Seeti Maar Movie, Tamannaah, Tamannaah Interested On Special Roles, Telugu Cinema, Tollywood, Tollywood Heroines

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ అందుకున్న ముద్దుగుమ్మ తమన్నా.ఈ అమ్మడు తెలుగులో సుమారు అందరి స్టార్ హీరోలతో ఆడిపాడింది.

TeluguStop.com - Tamannaah Interested On Special Roles

అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్ అగ్ర హీరోలతో కూడా జత కట్టింది.తన ప్రయాణంలో ఈ అమ్మడు నటిగా కూడా బెస్ట్ అనిపించుకునే సినిమాలు చేసింది.

అందులో 100 పర్సెంట్ లవ్ సినిమాలో ఆమె చేసిన పాత్ర తమన్నాకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.అలాగే అభినేత్రి సిరీస్ లో కూడా తమన్నా నట విశ్వరూపం చూపించింది.

TeluguStop.com - కథ నచ్చితే గెస్ట్ రోల్ అయినా ఓకే అంటున్న తమన్నా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

స్వతహాగాగా మంచి డాన్స్ కూడా కావడంతో అవకాశాలు వాటికవే వచ్చాయి.కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తమిళ సినిమాలు, అలాగే హిందీలో కూడా మంచి సినిమాలలో నటించింది.

ఇప్పుడు పదేళ్లకి పైగా కెరియర్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ భామకి మెల్లగా అవకాశాలు తగ్గుతున్నాయి.ప్రస్తుతం హీరోయిన్స్ కాంపిటేషన్ పెరగడంతో పాటు కొత్త భామలు దూసుకొస్తున్నారు.

ఈ నేపధ్యంలో తమన్నా సీనియర్ కేటగిరీలోకి చేరిపోయింది.

ప్రస్తుతం తమన్నా గోపీచంద్ తో సిటీ మార్ సినిమాతో పాటు, సత్యదేవ్ తో గుర్తుందా శీతాకాలం అలాగే అంధాదున్ రీమేక్ లో నెగిటివ్ రోల్ చేస్తుంది.

అలాగే హిందీలో కూడా ఒక సినిమా సెట్స్ పై ఉంది.కెరియర్ పరంగా చూసుకుంటే చేతిలో బాగానే సినిమాలు ఉన్నాయి.అయితే ప్రస్తుతం ఈ అమ్మడు హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా కొత్తదనం, ప్రత్యేకత ఉన్న పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది.కథ, అందులో తన పాత్ర ప్రాధాన్యత బాగుంటే తక్కువ నిడివి ఉండే క్యామియో రోల్స్ చేయడానికి కూడా నేను రెడీ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇప్పుడు తన దృష్టి అంతా ప్రత్యేకమైన పాత్రలలో నటించి బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవడంపై ఉందని, నా కోసం సృష్టించిన పాత్రల కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చింది.మొత్తానికి హీరోయిన్ గానే చేస్తా అని తమన్నా మడికట్టుకొని కూర్చోకుండా స్పెషల్ రోల్స్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మరిన్ని అవకాశాలు పెరిగే అవకాశం ఉందని టాలీవుడ్ లో వినిపిస్తుంది.

.

#Tamannaah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tamannaah Interested On Special Roles Related Telugu News,Photos/Pics,Images..