మహేష్ తో మరోసారి జతకడుతున్న తమన్నా

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

 Tamannaah Has Been Paired Opposite Mahesh-TeluguStop.com

నెక్స్ట్ షెడ్యూల్ గోవాలో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీ గా కీర్తి సురేష్ నటిస్తుంది.

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఏ మాత్రం ఆలోచించకుండా చేయడానికి రెడీ అంటారు.అతనికున్న ఫాలోయింగ్ ఆ స్థాయిలో ఉంటుంది.

 Tamannaah Has Been Paired Opposite Mahesh-మహేష్ తో మరోసారి జతకడుతున్న తమన్నా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు సినిమాలకే పరిమితం అయిన మహేష్ కి బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఫ్యాన్స్ గా ఉన్నారంటే అతని అందానికున్న గొప్పతనం అని చెప్పాలి ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్ తమన్నా కూడా గతంలో మహేష్ బాబుతో కలిసి నటించింది.శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు సినిమాలో మహేష్ బాబు, తమన్నా జోడీగా కనిపించారు.

ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.తరువాత వీరి కాంబినేషన్ లో ఏ మూవీ కూడా రాలేదు.అయితే చాలా కాలం తర్వాత మరోసారి వీరిద్దరు జత కడుతున్నారు.అయితే ఈ సారి వీరు జతకడుతుంది ఒక యాడ్ కోసం మాత్రమే.

పాపులర్ పరుపుల కంపెనీకి ప్రచారం చేయనున్నారు.దీనికి సంబంధించిన వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.ప్రకటనలో తమన్నా లుక్ కాస్త డిఫరెంట్ గానే కనిపిస్తుందట.

ఓవైపు మహేష్ సర్కార్ వారి పాట చిత్రీకరణలో బిజీగా ఉండగానే ఈ ప్రకటనను గ్యాప్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.ఇదిలా ఉంటే తమన్నా నటించిన సిటీమార్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

అలాగే ఎఫ్3 షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.అంధాదున్ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

#Mahesh #Tamannaah

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు