బెడ్‌రూం సీన్స్‌పై తమన్నా క్లారిటీ  

Tamannaah Gives Clarity On Bed Room Scenes - Telugu Hot Gossips, Seetimaar, Tamannaah, Tollywood News

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా తన సత్తా చాటుతూ ఇప్పటివరకు అనేక సినిమాల్లో నటించింది.ఈ బ్యూటీ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

 Tamannaah Gives Clarity On Bed Room Scenes

ఇక ఈ హీరోయిన్ దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.కాగా ఈ మధ్య కాలంలో హీరోయిన్‌గా తనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం లేదనే వాస్తవాన్ని తమన్నా ఇప్పటికే ఒప్పుకుంది.

ప్రస్తుతం సీటీమార్ అనే సినిమాలో నటిస్తున్న తమన్నా టాలీవుడ్‌లో హాట్ రోల్స్‌లో నటించే విషయంపై తాజాగా ఓ కామెంట్ చేసింది.సినిమాల్లో హాట్ సీన్స్‌లో నటించడం పూర్తిగా హీరోయిన్స్ నిర్ణయంపైనే ఉంటుందని, వారిని ఎవరూ బలవంత పెట్టరని ఆమె చెప్పుకొచ్చింది.

బెడ్‌రూం సీన్స్‌పై తమన్నా క్లారిటీ-Gossips-Telugu Tollywood Photo Image

సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ముద్దు సీన్స్‌కు ఆమడదూరం ఉండాలని కఠినంగా నిర్ణయించుకున్న తమన్నా, ఆ తరువాత కథలో అవసరం ఉంటేనే ముద్దు సీన్స్‌ను అడుగుతారని గుర్తించి అటుపై వాటిలో నటించేందుకు ఓకే చెప్పానంటోంది.ఇక బెడ్ రూం హాట్ సీన్స్‌లో నటించేటప్పుడు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, అదంతా షూటింగ్‌లో భాగం మాత్రమే అని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక గతంలో మీటూ అంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి విన్నప్పుడు, అసలు అమ్మాయిలు ఇష్టపడకపోతే ఇలాంటి ఘటనలే చోటు చేసుకోవు కదా అంటూ తమన్నా తన మనసులోని మాటలు చెప్పుకొచ్చింది.మొత్తానికి తనవరకు తన పంథా ఏమిటో క్లియర్‌గా చెప్పుకొచ్చింది ఈ తెల్లతోలు పిల్ల.

ప్రస్తుతం తాను సీటీమార్ చిత్రంలో నటిస్తున్నానని, ఇందులో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test