భారీగా పెంచిన బ్యూటీ.. అంతలేదమ్మా అంటోన్న మిల్కీ!  

Tamannaah Denies Remuneration Hike - Telugu Remuneration, Seetimaar, Tamannaah, Tollywood News

టాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న అందాల భామ తమన్నా, దశాబ్ద కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది.స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన ఈ బ్యూటీ దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేసింది.

 Tamannaah Denies Remuneration Hike

అయితే కొత్త ట్యాలెంట్ వస్తు్న్న కొద్దీ ఈ బ్యూటీకి అవకాశాలు కాస్త తగ్గాయనే చెప్పాలి.కానీ చాలా సెలెక్టివ్‌గా తన సినిమాలను చేసుకుంటూ వెళ్తోంది ఈ బ్యూటీ.

కాగా ఇటీవల చాలా తక్కువగా అవకాశాలు వస్తున్న తమన్నా, తన సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ అంటోంది.అయితే అమ్మడు భారీగా రెమ్యునరేషన్ పెంచేసిందని, మిల్కీ అందాలను ఆరబోయడానికే ఇలా పారితోషకం పెంచేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

భారీగా పెంచిన బ్యూటీ.. అంతలేదమ్మా అంటోన్న మిల్కీ-Gossips-Telugu Tollywood Photo Image

తాజాగా మాస్ రాజా రవితేజ నటించబోయే సినిమాలో తమన్నా హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యింది.కాగా ఈ సినిమా కోసం అమ్మడు ఏకంగా రూ.2.5 కోట్లు డిమాండ్ చేస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తన రెమ్యునరేషన్ ఏమాత్రం పెంచలేదని తమ్మూ తేల్చేసింది.తన మార్కెట్ వాల్యూ ఎంతో తనకు తెలుసని, అందుకు తగ్గట్టుగానే రెమ్యునరేషన్ తీసుకుంటానని, భారీగా డిమాండ్ చేయడం తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చింది.

మొత్తానికి తమన్నా తన రెమ్యునరేషన్ విషయంలో వస్తున్న వార్తలన్నింటినీ కొట్టిపడేసిందని చెప్పాలి.కాగా ప్రస్తుతం గోపీచంద్ నటిస్తున్న సీటీమార్ చిత్రంలో తమన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు