బోల్డ్ పాత్రకు భారీగా డిమాండ్ చేస్తోన్న మిల్కీ బ్యూటీ

బాలీవుడ్‌లో సూపర్ హిట్ మూవీగా నిలిచిన అంధాధున్ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులో రీమేక్ చేసేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్ గుడ్డివాడిగా నటించే వ్యక్తిగా మనకు కనిపిస్తాడు.

 Tamannaah Demands 2 Cr For Andhadhun Remake, Tamannaah, Andhadhun Remake, Nithii-TeluguStop.com

కాగా ఈ సినిమా బోల్డ్ కంటెంట్‌తో పాటు బోలెడు హాట్ సీన్స్‌తో రాబోతుంది.అయితే బాలీవుడ్‌లో టబూ చేసిన పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఆమె చేసిన బోల్డ్ సీన్స్ ప్రేక్షకుల్లో వేడిని పుట్టించాయి.కాగా ఆమె పాత్రను తెలుగులో ఎవరు చేస్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
అయితే మిల్కీ బ్యూటీ తమన్నా ఈ పాత్ర చేసేందుకు ఓకే అనడంతో ఆమె హాట్ సీన్స్‌తో ఏ రేంజ్‌లో వేడి పుట్టిస్తుందా అని అందరూ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాలో బోల్డ్ పాత్ర కావడంతో తమన్నా ఈ సినిమాలో నటించేందుకు భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో ఆమె పాత్ర కోసం ఏకంగా రూ.2 కోట్లు పుచ్చుకుంటుందట ఈ మిల్కీ బ్యూటీ.ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటుందంటే, ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు అంటున్నారు సినీ క్రిటిక్స్.మరి స్కిన్ షోతో పాటు హాట్ సీన్స్‌లో తమ్మూ పాప ఎలా రెచ్చిపోతుందో చూడాలి అంటున్నారు ఆమె అభిమానులు.

ఇక నితిన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.కాగా ఈ సినిమా షూటింగ్‌ను నవంబర్ నెలలో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఈ సినిమాను దర్శకుడు మేర్లపాక గాంధీ తనదైన శైలిలో డైరెక్ట్ చేసేందుకు రెడీ అయ్యాడు.శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

కాగా నితిన్ ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా లైన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube