అయ్యో పాపం.. తమన్నకు పేమెంట్స్ ఎగొట్టిన మాస్టర్ చెఫ్.. అందుకే అనసూయను?

Tamannaah Bhatia To Take Legal Action Against Masterchef Telugu

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత కొద్ది రోజుల క్రితం వరకు ఈమెకు కాస్త అవకాశాలు తగ్గినప్పటికీ, ప్రస్తుతం ఈమె ఎంతో బిజీగా ఉన్నారు.

 Tamannaah Bhatia To Take Legal Action Against Masterchef Telugu-TeluguStop.com

వెండితెరపై సినిమాలతో సందడి చేయడమే కాకుండా పలు వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.అలాగే బుల్లితెరపై మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

ఆగస్టు 27 నుంచి ప్రసారమవుతున్న ఈ కార్యక్రమానికి తమన్నా వ్యాఖ్యాతగా వ్యవహరించగా సంజయ్ తుమ్మ, చలపతి రావు, మహేష్ పడాల జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.కుకింగ్ షో అంటే ఎంతో ఇష్టపడిన తమన్నా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఎంతో ఆనందపడ్డారు.

 Tamannaah Bhatia To Take Legal Action Against Masterchef Telugu-అయ్యో పాపం.. తమన్నకు పేమెంట్స్ ఎగొట్టిన మాస్టర్ చెఫ్.. అందుకే అనసూయను-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ షో కోసం తనకు వచ్చిన ఎన్నో కమిట్మెంట్ ను కూడా వదులుకున్నారు.ఇదిలా ఉండగా కొన్ని ఎపిసోడ్ లో ప్రసారం అయిన తర్వాత ఈ కార్యక్రమ నిర్వాహకులు తమన్నాతో ఎలాంటి కమ్యూనికేషన్స్ లేకుండా తనను ఈ షో నుంచి తప్పించారు.

ఈ క్రమంలోనే తమన్నా స్థానంలో యాంకర్ అనసూయను తీసుకోవడంతో తమన్నా కాల్షీట్స్ లేనందువల్ల అనసూయని తీసుకున్నట్లు అందరూ భావించారు.కానీ మాస్టర్ చెఫ్ నిర్వాహకులు మాత్రం తమన్నాకు పేమెంట్స్ ఇవ్వకుండా ఉండడమే కాకుండా తనకు తెలియకుండా ఇలా షో నుంచి తనను తీసేయడంతో ఈ విషయంపై ఆమె సీరియస్ అయి లీగల్ గా చర్యలు తీసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తమన్నా తరపు న్యాయవాది సోషల్ మీడియాకు తెలియజేశారు.ఏది ఏమైనా ఒక స్టార్ హీరోయిన్ పట్ల ఇలా ప్రవర్తించడం తనను అవమానించినట్లేనని ఆమె అభిమానులు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

#Tamannaah #Masterchef

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube