'మాస్టర్ చెఫ్' నిర్వాహకులపై లీగల్ చర్యలకు సిద్ధం అవుతున్న తమన్నా!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా గడుపు తుంది.మధ్యలో కొద్దిగా అవకాశాలు తగ్గిన కూడా మళ్ళీ ఉపందుకుని ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకు పోతుంది.

 Tamannaah Bhatia To Take Legal Action Against Makers Of Masterchef Telugu Detail-TeluguStop.com

ఇక ఈ మధ్యనే తమన్నా టీవీ రంగంలోకి కూడా ఎంటర్ అయ్యింది.మాస్టర్ చెఫ్ అనే తెలుగు ఫుడ్ షో ద్వారా ఈమె జెమినీ టీవీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ షో అన్ని భాషల్లో పాపులర్ అయ్యింది కానీ తెలుగులో మాత్రం ఆకట్టుకోలేక పోయింది.మాములు టీఆర్పీ కూడా అందుకోలేక చతికల పడిపోయింది.ఈ షో లో తమన్నా స్టార్ డమ్ కూడా ఏమాత్రం ఉపయోగ పడలేదు.అయితే తమన్నా కొన్ని ఎపిసోడ్స్ బాగానే చేసిన తర్వాత తమన్నా ప్లేస్ లో జెమిని టీవీ అనసూయను యాంకర్ గా తీసుకుంది.

తనకు రావాల్సిన అమౌంట్ విషయంలో.ఇంకా నిర్వాహకుల కారణంగా ఈ షో నుండి తమన్నా తప్పుకుంది.

అయితే ఈ మధ్యనే ఈ షో నిర్వాహకులు తమన్నా రెండు రోజులు షూటింగ్ రాకపోవడం వల్ల తమకు 5 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని ప్రెస్ నోట్ విడుదల చేయడంతో ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరింది.

Telugu Anasuya, Bhola Shankar, Tamanna, Tamannaahmakers, Tamannah-Movie

ఇలా ఈ షో నిర్వాహకులు ప్రెస్ నోట్ విడుదల చేయడంపై తమన్నా సీరియస్ అయినట్టు తెలుస్తుంది.తన గురించి నెగిటివ్ వార్తలను ప్రచారం చేస్తున్నారని.దీని వల్ల చెడ్డ పేరు వస్తుందని తమన్నా లీగల్ గా చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతుంది.

Telugu Anasuya, Bhola Shankar, Tamanna, Tamannaahmakers, Tamannah-Movie

ఇప్పటికే ఈ విషయంపై తమన్నా లీగల్ టీమ్ ను కూడా కలిసిందని తెలుస్తుంది.చూడాలి మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో.ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే ప్రెసెంట్ తమన్నా ఎఫ్ 3 తో పాటు.చిరంజీవి భోళా శంకర్ సినిమాలు చేస్తుంది.ఇక వీటితో పాటు సత్య దేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో కూడా నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube