రాజు గారి గదిలోకి వెళ్లబోతున్న తమన్నా... ఈసారి రచ్చ రచ్చ అంటున్న అన్నయ్య  

Tamannaah Bhatia To Star In \'raju Gari Gadhi 3\'-raju Gari Gadhi 3,tamannaah Bhatia

యాంకర్‌గా గుర్తింపు దక్కించుకుని అందరితో ఓంకార్‌ అన్నయ్య అంటూ అనిపించుకున్న ఇతగాడు దర్శకుడిగా మారి మంచి సినిమాలు తీస్తున్నాడు. రాజుగారి గది అంటూ ఒక సినిమాను తీసి భయపెట్టడంతో పాటు నవ్వించిన ఓంకార్‌ ఆ తర్వాత రాజుగారి గది 2 అనే చిత్రాన్ని చేశాడు. నాగార్జున మరియు సమంతలు కీలక పాత్రల్లో నటించిన ఆ సినిమా కూడా మంచి టాక్‌ను దక్కించుకోవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. మొదటి రెండు రాజు గారి గదులు కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌అందించిన నేపథ్యంలో మూడవ రాజుగారి గది ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు..

రాజు గారి గదిలోకి వెళ్లబోతున్న తమన్నా... ఈసారి రచ్చ రచ్చ అంటున్న అన్నయ్య-Tamannaah Bhatia To Star In 'Raju Gari Gadhi 3'

ఓంకార్‌ తాజాగా రాజు గారి గది 3 చిత్రానికి రంగం సిద్దం చేశాడు. ఒక మంచి స్క్రిప్ట్‌తో రాజుగారి గది 3 ఉంటుందని చెబుతున్నాడు. మొదటి రెండు పార్ట్‌లకు ఏమాత్రం సంబంధం లేకుండా ఈ చిత్రం ఉంటుందని చెబుతున్నాడు. రాజుగారి గది 2లో నాగార్జునను నటింపజేసిన ఓంకార్‌ ఈసారి మూడవ పార్ట్‌లో హీరో లేకుండా కేవలం హీరోయిన్‌తో నడిపించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.

రాజు గారి గది 3 చిత్రం కోసం ఇటీవలే తమన్నాను ఎంపిక చేయడం జరిగిందని, ఎఫ్‌ 2 చిత్రం తర్వాత తమన్నా క్రేజ్‌ మళ్లీ పెరిగింది. ఆమెలో ఇంకా అందం, అట్రాక్షన్‌ తగ్గలేదని ఎఫ్‌ 2 చిత్రం నిరూపించింది. అందుకే రాజు గారి గది 3 చిత్రం కోసం తమన్నాను ఓంకార్‌ తీసుకుని ఉంటాడు అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సమ్మర్‌ తర్వాత సినిమా షూటింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.

ఇదే ఏడాదిలో సినిమా విడుదల అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు. పూర్తి వివరాలు ఓంకార్‌ త్వరలో వెళ్లడించే అవకాశం ఉంది. మొదటి రెండు పార్ట్‌ల కంటే మూడవ పార్ట్‌ రచ్చ రచ్చ ఉండటం ఖాయం అంటూ ఓంకార్‌ సన్నిహితుల వద్ద చెబుతున్నాడట..