తమన్నా ఆస్తుల విలువ అన్ని కోట్ల రూపాయలా.. ఐదో అతిపెద్ద వజ్రం అంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తమన్నా అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది తన అందం.

 Tamannaah Bhatia Has Expensive Diamond And Cars Life Style, Tamannah Bhatia, Tamannaah, Luxurious Life, Diamond, Cars, Upasana-TeluguStop.com

ఈమె మొదట హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.

అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది తమన్నా.అయితే తమన్నా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా 15 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ ముద్దుగుమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

 Tamannaah Bhatia Has Expensive Diamond And Cars Life Style, Tamannah Bhatia, Tamannaah, Luxurious Life, Diamond, Cars, Upasana -తమన్నా ఆస్తుల విలువ అన్ని కోట్ల రూపాయలా.. ఐదో అతిపెద్ద వజ్రం అంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా ఇప్పటికీ తెలుగు తమిళ,హిందీ,కన్నడ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉంది.కాగా తమన్నా ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక తమన్నా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తోంది.అయితే ఇప్పుడు వరకు దాదాపుగా 50 పైగా సినిమాలలో నటించింది.

తెరపైన ఏ విధంగా అయితే ఉంటుందో తెర వెనుక కూడా అంతే జాలిగా సంతోషంగా ఉంటుందట.ఈ ముద్దు గుమ్మ సినిమాలలో నటిస్తూనే దాదాపుగా 150 కోట్లకు పైగా ఆస్తిని కూడా పెట్టిందట.

వీటితోపాటుగా ఖరీదైన కార్లు ఇల్లు, ఆభరణాలు కూడా ఉన్నాయట.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నా దగ్గర ఉన్న ఒక వస్తువు గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

అదేమిటంటే ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రం తమన్నా దగ్గర ఉందని అయితే సుమారుగా దాదాపు రెండు కోట్లు విలువైన ఆ వజ్రాన్ని హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తనకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇకపోతే తమన్నా ఆస్తుల విషయానికొస్తే.ఈమెకు ముంబైలోని అత్యంత ఖరీదైన జుహూ ప్రాంతంలో 16.60 కోట్ల అపార్ట్‌మెంట్‌ ఉందట.దీని విస్తీర్ణం 80, 778 చదరపు అడుగులు ఉంటుందని సమాచారం.అలాగే రూ.1.02 కోట్ల మెర్సిడెస్ బెంజ్ జి ఎల్‌, రూ.75.59 లక్షల ఖరీదుగల ల్యాండ్‌ రోవర్ రేంజ్ రోవర్‌ డిస్కవరీ స్పోర్ట్స్‌, రూ.43.50 లక్షల బీఎండబ్ల్యూ 320 ఐ, , రూ.29.96 లక్షల మిత్సుబిషి పేజర్‌ స్పోర్ట్స్‌ కార్లు ఉన్నాయని సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube