ఇట్స్ యువర్ టర్న్.. అంటూ కొత్త ఛాలెంజ్ చేసిన మిల్కీ బ్యూటీ..!

తమన్నా మొదటగా మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది.ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాలో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Tamannaah Bhatia Dances Her Special Song Kodthe And Challenges, Tamannaah Bhatia, Tollywood, Challenges, Special Song-TeluguStop.com

ఆ సినిమా ద్వారా తమన్నాకు తెలుగులో చాలా సినిమాలలో నటించే అవకాశం వచ్చింది.మిల్కీ బ్యూటీ తన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది.

టాలీవుడ్ లో తమన్నా ప్రముఖ హీరోల సరసన కూడా నటించింది.సినిమాలో హీరోయిన్ గా మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ బిగ్ స్క్రీన్ మీద అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.

 Tamannaah Bhatia Dances Her Special Song Kodthe And Challenges, Tamannaah Bhatia, Tollywood, Challenges, Special Song-ఇట్స్ యువర్ టర్న్.. అంటూ కొత్త ఛాలెంజ్ చేసిన మిల్కీ బ్యూటీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు‘ అనే సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసింది.ఇటీవల తమన్నా “మాస్టర్ చెఫ్ “కుకింగ్ షో కి కూడా కొంతకాలం హోస్ట్ గా వ్యవహరించింది.తమన్నా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా డిజిటల్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుతోంది.‘లెవన్త్‌ అవర్‌’, ‘నవంబర్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌లతో డిజిటల్‌ స్క్రీన్‌పై తమన్నా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.తమన్నా నటించిన ఎఫ్ 2 సినిమా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.నితిన్ హీరోగా నటించిన మాస్ట్రో సినిమాలో తమన్నా ఒక వైవిధ్యమైన పాత్రను పోషించింది.

Telugu Challenges, Tamannaah, Tollywood-Movie

ప్రస్తుతం తమన్నా ఎఫ్3 సినిమా ద్వారా బిగ్ స్క్రీన్ పై కనిపించనుంది.వరుణ్ సందేశ్ హీరోగా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “గని” సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.ఈ సినిమా మార్చి 18న విడుదల కానున్నట్లు సమాచారం.ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఐటమ్ సాంగ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.ఈ సాంగ్ ఈ నెల 16న విడుదలై అందరిని అలరించింది.ప్రస్తుతం అందరికీ ‘కొడ్తే’ సాంగ్ ఫీవర్ అంటుకుంది.

తాజాగా తమన్నా  ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అందరికీ చాలెంజ్ విసిరింది.ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నా గని సినిమాలోని పాటకు స్టెప్పులేస్తూ ఉన్న వీడియో పోస్ట్ చేసింది.

ఆ వీడియో ద్వారా తమన్నా అందరికీ డాన్స్ ఛాలెంజ్ చేసింది.ఆ వీడియోలో తమన్నా బ్లాక్ క్రాప్ టాప్, బ్లాక్ బ్యాగీ ప్యాంటు ధరించింది.

ఈ విధంగా కూడా సినిమాకు ప్రమోషన్స్ జరుగుతున్నాయి.బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube