ప్రభాస్ మళ్ళీ తన మరదలికి ఛాన్స్ ఇస్తాడా....?

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.కాగా ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని అంతేగాక ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ తరహాలో ఉండబోతున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు ఇప్పటికే బలంగా చర్చించుకుంటున్నారు.

 Tamanna, Telugu Heroien, Prabhas, Hero, Nag Ashwin, Mahanati-TeluguStop.com

కాగా తాజాగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే గతంలో ప్రభాస్ సరసన రెబల్ అనే చిత్రంలో హీరోయిన్ నటించినటువంటి తమన్నా మళ్ళీ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో  వినిపిస్తున్నాయి.

అలాగే ఈ చిత్రంలో తమన్నా ఓ సైంటిస్ట్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.గతంలో రెబల్ చిత్రంలో కూడా తమన్నా తన నటన, అందం, అభినయంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

గతంలో అలనాటి అందాలతార మహానటి సావిత్రి జీవిత గాథలు కళ్లకు కట్టినట్లు తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాడు నాగ్ అశ్విన్.దీంతో ప్రభాస్ నాగ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ  చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు  రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్నటువంటి జాన్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు పూర్తవ్వగానే నాగ్ అశ్విన్ మరియు ప్రభాస్ ల చిత్ర షూటింగ్ పనులు  మొదలవనున్నట్లు సమాచరం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube