నిహారికకు తమన్నా ఫుల్ సపోర్ట్.. తప్పుడు ప్రచారంపై ఫైర్!

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్, బంజారాహిల్స్ లో జరిగిన ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని ఫుడ్ అండీ మింక్ పబ్ వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.

 Tamanna Simhadri Reacts Niharika Konidela Pub Case, Tamanna Simhadri, Niharika,-TeluguStop.com

ఈ సంఘటన జరిగి రెండు మూడు రోజులు అవుతున్నా కూడా ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది.పబ్ ను సమయానికి మించి రన్ చేస్తున్నారు అని పోలీసులకు సమాచారం అందడంతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ పబ్ పై దాడులు నిర్వహించి పబ్బు యజమానులతో పాటు దాదాపుగా 150 మందిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

150 మందులు టాలీవుడ్ ప్రముఖ సింగర్ అయిన రాహుల్ సిప్లిగంజ్, అలాగే మెగా డాటర్ నిహారిక తో పాటు పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ విషయం పై పలువురు స్పందించగా తాజాగా ట్రాన్స్ జెండర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన తమన్నా సింహాద్రి స్పందించింది.

ఎవరో కొందరు తప్పు చేస్తే పబ్బు లోకి వెళ్ళిన వాళ్లందరినీ దొంగలా చూస్తున్నారు అంటూ తమన్నా సింహాద్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.అంతేకాకుండా పబ్ కి వెళ్లడమే తప్పు అన్నట్టుగా మెగా డాటర్ నిహారిక పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆరోపించింది.

Telugu Niharika, Pub, Tollywood-Movie

నిహారిక కేవలం తన ఫ్రెండ్ బర్తడే పార్టీ కోసం మాత్రమే అక్కడికి వెళ్లిందని తమన్నా సింహాద్రి చెప్పుకొచ్చింది.అయితే పబ్లిక్ కి వెళ్లిన మిగతా వారందరిని వదిలేసి కేవలం నిహారిక ను మాత్రమే టార్గెట్ చేస్తూ స్టోరీస్ రాయడం ఫై మండిపడింది తమన్నా సింహాద్రి.నిహారిక డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు ఎక్కడా చెప్పలేదని, అలాగే పోలీసులు దాడి చేసే సమయంలో చాలామంది పారిపోయారు కూడా అని తెలిపింది.ఇదే విషయం పై మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం చాలా దారుణం అంటూ మండిపడుతోంది తమన్నా సింహాద్రి.

అంతేకాకుండా ఆలా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేసేవారిని తప్పకుండా అడ్డుకుంటామని తమన్నా తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube