బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయిన హేమ! వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్ జెండర్

అందరూ ఊహించినట్లే బిగ్ బాస్ హౌస్ నుంచి మొదటి వారంలోనే హేమ నామినేట్ అయ్యి బయటకి వెళ్ళిపోయింది.హౌస్ లో అందరికంటే ఎక్కువ డామినేటెడ్ గా, అలాయే యంగ్ టీం మధ్యలో ఓ సీనియర్ గా ఉన్న హేమ వీక్షకుల నుంచి అతి తక్కువ ఓటింగ్ పాయింట్స్ తెచ్చుకొని హౌస్ నుంచి బయటకి వచ్చేసింది.

 Tamanna Simhadri Many Wild Card Entry In Bigg Boss 3-TeluguStop.com

తనని తాను టెస్ట్ చేసుకోవడానికి అని హౌస్ లోకి అడుగుపెడుతున్న అని చెప్పిన హేమ వారంని వారం రోజులకి మించి ఆడియన్స్ కూడా భరించలేకపోయారు.ఇక హౌస్ లో కూడా మెజారిటీ మెంబర్స్ హేమ మీద ఆసక్తి చూపించకపోవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకి వచ్చేసింది.

హేమకి ఓట్లు వేయాల్సిందిగా ఇండస్ట్రీలో క్యాంపైన్‌ నడిచినా కానీ ఆమె ఒక్క వారానికి మించి హౌస్‌లో వుండలేకపోయింది.ఈ రోజు ఎపిసోడ్‌లో హేమ ఎలిమినేట్‌ అయ్యింది.ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కి మరో సంచలనం ఎంటర్ కాబోతుంది.వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి న్యూస్ చానల్ టిబెట్ లతో ఫేం లోకి వచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇస్తుందని తెలుస్తుంది.

శ్రీరెడ్డి వివాదం సమయంలో తెర మీదకి వచ్చిన తమన్నా సింహాద్రి ఆమె కంటే ముందుగా బిగ్‌బాస్‌ హౌస్ లోకి వెళ్ళబోతుంది.ఇక ఇప్పుడు ఈమెతో మిగిలిన సభ్యులు ఎలా ఉంటారు అనేదాని బట్టి షో మరింత ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube