బిగ్‌బాస్‌ : సిగ్గుందా, కడుపుకు అన్నం తింటున్నావా అంటూ అతడిపై తమన్నా లొల్లి

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో ట్రాన్స్‌ జెండర్‌ తమన్నా సింహాద్రీని పంపించిన విషయం తెల్సిందే.తమన్నా ఇంట్లోకి వెళ్లినప్పటి నుండి కొందరు ఇంటి సభ్యులు మరియు బయట ప్రేక్షకులు చాలా చిరాకు పడుతున్నారు.

 Tamanna Simhadri Classes With Housemates In Big Boss Telugu-TeluguStop.com

ఆమె ఓవర్‌ యాక్షన్‌, ఆమె ప్రవర్తన అంతా చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.కొత్తలో రవికృష్ణ మరియు అలీలు ఆమెకు సన్నిహితంగా ఉండటంతో వారిని మరింత దగ్గర చేసుకునేందుకు ప్రయత్నించింది.

కాని వారు ఒక రేంజ్‌ వరకు స్నేహంకే ఓకే అనడంతో వారిని టార్గెట్‌ చేసినట్లుగా అనిపిస్తుంది.

బిగ్‌బాస్‌ : సిగ్గుందా, కడుపుక

మొన్నటి ఎపిసోడ్‌ లో రవికృష్ణను అమ్మాయిలా ఎందుకు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నావు అంటూ సీరియస్‌ అయ్యింది.ఇద్దరి మద్య వివాదం చాలా దూరం వెళ్తుందని భావించారు.కాని రవికృష్ణ మాత్రం సైలెంట్‌గా ఉన్నాడు.

ఇక నిన్నటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో అలీ రాజుగా ఉన్న సమయంలో ఇంటి సభ్యులతో టాస్క్‌ చేయిస్తుంటే తమన్నాకు చిరాకు ఎత్తింది.అసలు నువ్వు మనిషివేనా, సిగ్గుందా, కడుపుకు ఏం తింటున్నావ్‌ అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చి పోయింది.

బిగ్‌బాస్‌ : సిగ్గుందా, కడుపుక

తెల్లగా, కండలు పెంచి ఉన్నంత మాత్రాన నువ్వు ఒక స్టార్‌ అనుకుంటున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.పక్కన అమ్మాయిని కూర్చోబెట్టుకుని నువ్వు చేస్తున్నది ఏంటీ సిగ్గుందా అంటూ చాలా సమయం అలీని టార్గెట్‌ చేసింది.ఆ సమయంలో ఇంటి సభ్యులు అంతా కూడా తమన్నాను తప్పుబట్టారు.ఆ విషయం మరింత సీరియస్‌ అవ్వకుండా టాస్క్‌ పూర్తి అయ్యింది.ఈ వారంకు గాను వరుణ్‌ సందేశ్‌ ఇంటి కెప్టెన్‌ అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube