Tamannah: ఇప్పటికే వాళ్లిద్దరితో పెళ్లి చేసేశారు.. తమన్నా సంచలన కామెంట్స్ వైరల్!

స్టార్ హీరోయిన్ తమన్నాపై ఈ మధ్య కాలంలో ఏ స్థాయిలో రూమర్లు వచ్చాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.తమన్నాతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ పెళ్లి పీటలెక్కడంతో తమన్నా పెళ్లి గురించి ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.

 Tamanna Sensational Comments About Marriage Details, Tamannah, Tamannah Marriage-TeluguStop.com

అయితే కొన్నిరోజుల క్రితం తన పెళ్లి వార్తల్లో నిజం లేదని చెప్పిన తమన్నా ప్రస్తుతం పెళ్లి వార్తల గురించి మరోసారి షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.

ఓటీటీలో ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నానని తమన్నా తెలిపారు.

మలయాళంలో కూడా ఎంట్రీ ఇస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.తన పెళ్లి గురించి వైరల్ అవుతున్న కథనాలపై తమన్నా స్పందిస్తూ కొందరు నా పెళ్లి ఎప్పుడో చేసేశారని ఆమె కామెంట్లు చేశారు.

ఒకసారి డాక్టర్ తో నా పెళ్లి అని మరోసారి వ్యాపారవేత్తతో నా పెళ్లి అని కథనాలను జోరుగా ప్రచారంలోకి తెచ్చారని వాళ్లతో నా పెళ్లి చేసేశారని ఆమె అన్నారు.

అయితే వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తమన్నా చెప్పుకొచ్చారు.

Telugu Tamannah, Satyadev, Sensational, Tollywood-Movie

నిజంగా నా పెళ్లి ఫిక్స్ అయితే నేనే అందరికీ చెప్పి పెళ్లి చేసుకుంటానని పెళ్లి విషయంలో దాచాల్సిన అవసరం అయితే నాకు లేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.మా కుటుంబంలో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని పెళ్లి విషయంలో నాపై ఒత్తిడి ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

Telugu Tamannah, Satyadev, Sensational, Tollywood-Movie

సోషల్ మీడియాలో నా గురించి ప్రచారంలోకి వచ్చే మీమ్స్ ను అస్సలు పట్టించుకోనని తమన్నా అన్నారు.పెళ్లి తేదీ ఫిక్స్ అయితే అందరితో నేనే చెబుతానని వైరల్ అయిన వార్తలను నమ్మవద్దని ఆమె వెల్లడించారు.గుర్తుందా శీతాకాలం ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ఈ విషయాలను వెల్లడించగా తమన్నా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube