ఆ సాంగ్లో తమన్నా రెచ్చిపోయిందట..!

మిల్కీ బ్యూటీ తమన్నా రూటే సెపరేటు అని చెప్పాలి.ఓ పక్క హీరోయిన్ గా చేస్తూనే మరో పక్క ఐటం గాళ్ గా అదరగొడుతుంది తమన్నా.

 Tamanna Sampangi Item Song For Jaguar-TeluguStop.com

టాలీవుడ్లో ఊపందుకున్న హీరోయిన్స్ ఐటం సాంగ్స్ కు ముందు ఓ క్రేజ్ తీసుకొచ్చింది తమన్నానే.స్టార్స్ పక్కన నటిస్తూనే మరో పక్క కుర్ర హీరోలతో ఐటం సాంగ్స్ చేయడం తమన్నా వల్లే అయ్యింది.

బెల్లంకొండ శ్రీనివాస్ తో ఇప్పటికే రెండు ఐటం సాంగ్స్ చేసిన తమన్నా ఇప్పుడు కన్నడ హీరో నిఖిల్ జాగ్వార్ సినిమాలో ఐటం సాంగ్ చేసింది.

అయితే ఈ సినిమాలో ఆ సాంగ్ తో తమన్నాని సంపంగిగా మారుతుందట.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సాంగ్ శ్రోతలను అలరిస్తుంది.నిఖిల్ తో తమన్నా సాంగ్ లో రెచ్చిపోయిందట.

శాండల్ వుడ్ సంపంగిగా తమన్నా కొత్త క్రేజ్ దక్కించుకోనుంది.థమన్ మ్యూజిక్ కు తమన్నా డ్యాన్స్ ఇంకా ఏం కావాలి చెప్పండి.

దాదాపు కోటి రూపాయల పారితోషికం ఇచ్చి మరి తమన్నాతో ఐటం సాంగ్ ప్లాన్ చేసిన చిత్రయూనిట్ ఆ సాంగ్ లో తమన్నాని అన్నివిధాలుగా వాడేశారట.సినిమాలో ఆ సాంగ్ ఓ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది అంటున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube