మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే వదలకుండా చేస్తుంది.కేవలం సినిమాలే కాదు వెబ్ సీరీస్, టీవీ షోస్ చేస్తున్న ఈ అమ్మడు తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటుంది.
ఈ క్రమంలో లేటెస్ట్ గా బాలీవుడ్ లో ప్లాన్ ఏ ప్లాన్ బి అనే టైటిల్ తో వెబ్ సీరీస్ రాబోతుంది.నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ఈ వెబ్ సీరీస్ లో జెనిలియా భర్త రితేష్ దేశ్ ముఖ్ తో రొమాన్స్ చేస్తుంది తమన్నా.
నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న ఈ వెబ్ మూవీలో తమన్నా రెచ్చిపోతుందని తెలుస్తుంది.ఈ వెబ్ మూవీకి శశాంక్ ఘోష్ డైరెక్ట్ చేస్తున్నారు.
బాలీవుడ్ లో అడల్ట్ కామెడీ సినిమాలు చేస్తూ వస్తున్న రితేష్ తమన్నాతో చేస్తున్న ఈ వెబ్ మూవీ కూడా అలాంటి అడల్ట్ కంటెంట్ తోనే వస్తుందని తెలుస్తుంది.ఈ క్రమంలో సినిమాలో తమన్నాతో రొమాన్స్ ఒక రేంజ్ లో ఉండబోతుందని టాక్.
ప్లాన్ ఏ ప్లాన్ బి టైటిల్ కూడా వెరైటీగా ఉండటంతో కచ్చితంగా ఈ వెబ్ మూవీ తమన్నాకి బాలీవుడ్ లో మైలేజ్ పెంచేస్తుందని అంటున్నారు.సినిమాలతో పాటుగా డిజిటల్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటుతుంది తమన్నా భాటియా.