నాగచైతన్య ఫస్ట్ సినిమాను రిజెక్ట్ చేసిన తమన్నా.. ఎందుకంటే?

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సాధించిన ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.

 Tamanna Rejects Nagachaitanyas First Movie Because-TeluguStop.com

ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దకాలం పూర్తయినప్పటికీ ఇంకా ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అంది పుచ్చుకున్నారు అంటే ఈమె నటన నైపుణ్యం ఎలాంటిదో అర్థమవుతుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి శ్రీ అనే చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ మొదటి సినిమానే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో తమిళంలో మరో చిత్రం చేసింది.

ఈ చిత్రంలో నెగిటివ్ పాత్రలో కనిపించిన తమన్నా ఈ సినిమా కూడా తనకు మంచి గుర్తింపు తీసుకురా లేదనే చెప్పాలి.

 Tamanna Rejects Nagachaitanyas First Movie Because-నాగచైతన్య ఫస్ట్ సినిమాను రిజెక్ట్ చేసిన తమన్నా.. ఎందుకంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె తమిళంలో కూడా కాలేజ్ అనే చిత్రంలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

ఇలా ఈమెకు వరుస అవకాశాలు వస్తున్న సమయంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన జోష్ సినిమా ఆఫర్ వచ్చింది.ముందుగా ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటించడం కోసం హీరోయిన్ రాధ కూతురు కార్తిక స్థానంలో తమన్నాను తీసుకోవాలని భావించారు.

అయితే తమన్నా అప్పుడు వరుస సినిమాలను అందిపుచ్చుకోవడంతో ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.ఈ క్రమంలోనే రాధిక కూతురు కార్తీక నాగ చైతన్య జంటగా తెరకెక్కిన జోష్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

Telugu 100% Love, First Movie, Naga Chaitanya, Rejects, Tamanna, Thadaka Movies, Tollywood-Movie

నాగచైతన్య హీరోగా పరిచయమవుతున్న మొదటి సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్ కారణంగా తనతో స్క్రీన్ పంచుకోవడం కుదరని తమన్నా ఆ తర్వాత 100% లవ్ సినిమా ద్వారా వీరిద్దరూ కలిసి తెరపై సందడి చేశారు.ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అదేవిధంగా సునీల్ నాగచైతన్య మల్టీస్టారర్ చిత్రంగా తడాఖా సినిమాలో మరోసారి ఈ మిల్క్ బ్యూటీ నాగ చైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకున్నారని చెప్పవచ్చు.ఇలా వరుస సినిమాలు చేస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Telugu 100% Love, First Movie, Naga Chaitanya, Rejects, Tamanna, Thadaka Movies, Tollywood-Movie

కెరియర్ మొదట్లో తెలుగు రాక ఎంతో ఇబ్బంది పడిన తమన్నా ఎంత తొందరగా తెలుగు భాషపై పట్టు సాధించి పలు సినిమాలకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు.తెలుగులో స్పష్టంగా మాట్లాడటం నేర్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం బుల్లితెరపై ఒక వంటల ప్రోగ్రామ్ కూడా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా వంటల ప్రోగ్రామ్ ద్వారా బుల్లి తెరపై సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకాభిమానులను సంపాదించుకున్నారు.తాజాగా ఈమె గోపీచంద్ సరసన నటించిన సిటీ మార్ చిత్రం కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

#Thadaka #Tamanna #Naga Chaitanya #Love

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు