ఆ హీరోతో మరో పది సార్లు చేయడానికైనా రెడీ అంటున్న మిల్కీ బ్యూటీ....

తెలుగులో ఒకప్పుడు దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నవంటి ముంబై మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించి కొంతకాలం పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల సరసన వెలుగొందింది.

 Tamanna, Tollywood Actress, Milky Beauty, Remuneration Clashes, Ravi Teja, Tolly-TeluguStop.com

కానీ ఈమధ్య కాలంలో ఈ అమ్మడు నటించిన టువంటి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతుండడంతో ప్రస్తుతం తన తదుపరి చిత్రాల కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది.

అయితే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

అయితే ఇందులో ముఖ్యంగా ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చినప్పటికీ పారితోషికం విషయంలో కొంతమేర విభేదాలు రావడంతో ఈ అమ్మడు నటించనని చెప్పినట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.దాంతో తాజాగా ఈ విషయంపై తమన్నా భాటియా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందించింది.

ఇందులో భాగంగా తాను పారితోషకం ఈ విషయంలో విభేదాలు వచ్చి రవితేజ సరసన నటించలేదని వస్తున్నటువంటి వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని కొట్టిపారేసింది.అంతేకాక మరో పది సార్లు రవితేజ సరసన నటించే అవకాశం వచ్చినా కూడా నో చెప్ప నని అంటోంది ఈ అమ్మడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తమన్నా టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటిస్తున్నటువంటి “సీటీమార్” అనే చిత్రంలో నటిస్తోంది.ఈ చిత్రం చోటు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు సమాచారం.

కాగా ఈ చిత్రంలో తమన్నా భాటియా ప్రముఖ కబడ్డీ కోచ్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదల కాగా మంచి స్పందన వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube