స్టార్‌ హీరోయిన్‌ నటించి ఆ వెబ్‌ సిరీస్ మద్యలో ఆగిపోయిందా?

ఈమద్య కాలంలో చాలా మంది స్టార్‌ లు వెబ్‌ సిరీస్ లు అని మినీ మూవీస్ అంటూ ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు.సినిమాల్లో స్టార్‌ తగ్గుతున్న సమయంలో ఓటీటీ వెంట అడుగులు వేయడం చాలా కామన్ విషయంగా మారింది.

 Tamanna Praveen Sattar 11th Hour Movie Release In Aha Ott,thammannna,tollywood,1-TeluguStop.com

హీరోయిన్‌ గా తమన్నా సుదీర్ఘ కాలం పాటు స్టార్‌ డంను దక్కించుకుంది.అద్బుతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న తమన్నా 11త్ అవర్ అనే మూవీతో ఆహా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయబోతున్నట్లుగా రెండు మూడు నెలల క్రితమే ప్రకటన వచ్చింది.

కాని ఇప్పటి వరకు ఆ సినిమా విడుదల తేదీ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.ప్రముఖ దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆహా ద్వారా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించి ఇప్పుడేమో సిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు.

Telugu Aha, Aha Ott, Tamanna, Telugu Ott, Tollywood-Movie

సంక్రాంతికే సినిమాను విడుదల చేయదలని భావించారు.ఆహాలో సంక్రాంతి సందర్బంగా తమన్నా 11త్ అవర్ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.కాని సంక్రాంతి పోయి రెండు వారాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా సినిమా షూటింగ్‌ పూర్తి చేశారా లేదా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు.ఆ సినిమా అసలు షూటింగ్ చేశారా లేదా అనేది కూడా అనుమానాలు రేకెత్తించేలా చేస్తున్నాయి.

షూటింగ్ కు ఏమైనా అడ్డంకులు వచ్చి విడుదల వాయిదా పడిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆహా టీం ఓ మంచి విడుదల తేదీ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.సమంత నటించిన వెబ్‌ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌ సిరీస్ రాబోతుంది.

ఇదే సమయంలో తమన్నా వెబ్‌ మూవీ విషయమై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube