తమన్నా తల పొగరు మాటలు

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌లో తమన్నా ఒకరు.ఈమె ఇటీవల ‘బాహుబలి’ చిత్రంతో దుమ్ము రేపిన విషయం తెల్సిందే.

 Tamanna Over Confidence On Her Career-TeluguStop.com

అయితే ఆ తర్వాత వచ్చిన ‘బెంగాల్‌ టైగర్‌’ ఫ్లాప్‌ అవ్వడంతో ఈమె క్రేజ్‌ తగ్గిందని, ఈమెను సినిమాల్లో ఎంపిక చేసుకునేందుకు దర్శకులతో పాటు హీరోలు సైతం ఆసక్తి చూపడం లేదు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం మొదలైంది.ఇదే విషయాన్ని కొందరు ఆమె దృష్టికి తీసుకు వెళ్లగా… తన క్రేజ్‌ ఇప్పట్లో తగ్గదు అని, ఇంకా చాలా కాలం తన ప్లేస్‌కు ఎలాంటి ఢోకా లేదు అంటూ తమన్నా తల బిరుసు మాటలు మాట్లాడుతోంది.

తన స్థానంను మాటల్లో కాకుండా చేతల్లో నిరూపించుకోవాలని, ఎదగడానికి ప్రయత్నించాలి కాని, ఎదిగాను అంటూ గర్వ పడకూడదు అంటూ కొందరు సలహా ఇస్తున్నారు.ఈమె ప్రతి సినిమాకు కష్టపడతాను అని, ఆ కష్టం తనకు తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చింది.

ఏ భాషలో అయినా ఎప్పుడు అయినా, ఎలాంటి పాత్రలో అయినా నటించేందుకు తాను సిద్దంగా ఉంటాను అని చెప్పుకొచ్చింది.‘బాహుబలి’ చిత్రం కాకుండా తెలుగులో మరో సినిమా ప్రస్తుతం ఈమెకు లేదు.

మొదటి పార్ట్‌లో ఎక్కువగా కనిపించిన తమన్నా ‘బాహుబలి’ రెండవ పార్ట్‌లో పెద్దగా కనిపించదని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube