తమ్మన్నా ఇక సర్దేసుకోవడమేనా? మరో ప్రయత్నం ఫ్లాప్‌

మిల్కీ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు అయ్యింది.టాలీవుడ్ మరియు కోలీవుడ్‌ లో తమన్నా దాదాపుగా దశాబ్ద కాలం పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది.

 Tamanna November Story Web Series Also Flap.latest Tollywood Viral-TeluguStop.com

దాదాపు అందరు సీనియర్ హీరోలతో పాటు యంగ్‌ స్టార్ హీరోలతో కూడా ఈమె నటించింది.ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును దక్కించుకోవడంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.

ఇటీవల కాలంలో ఈమె కాస్త డల్‌ అయినట్లుగా అనిపించింది.సినిమా ల్లో హీరోయిన్ గా ఈమెకు ఆఫర్లు ఆశించిన స్థాయిలో రాలేదు.

దానికి తోడు ఈమె హీరోయిన్‌ గా నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్ల పడుతూ వచ్చాయి.దాంతో మళ్లీ సినిమాలు కూడా ఆమెకు ఆఫర్‌ దక్కలేదు.

దాంతో మిల్కీ బ్యూటీ ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి.హీరోయిన్ గా ఆఫర్లు రాని సమయంలో వెబ్‌ సిరీస్ ల వైపు ఈమె పడింది.

వరుసగా వెబ్‌ సిరీస్ లు మరియు ఓటీటీ కంటెంట్‌ ను చేసేందుకు సిద్దం అయ్యింది తమన్నా.

తమన్నా మొదటగా లెవన్త్‌ అవన్‌ వెబ్‌ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆహా ద్వారా స్ట్రీమింగ్‌ అవుతున్న ఆ వెబ్‌ సిరీస్ ను జనాలు ఆధరించడం లేదు.గత కొన్నాళ్లుగా తమన్నాను ఎలా అయితే చూశామో అలాగే ఈ వెబ్‌ సిరీస్ లో చూశాం.

కొత్తగా ఏమీ లేదు అంటూ పెదవి విరిచారు.దాంతో తమన్నా సెకండ్‌ వెబ్‌ సిరీస్ పై అంచనాలు తగ్గాయి.

నవంబర్‌ స్టోరీ పేరు తో తమన్నా రెండవ వెబ్‌ సిరీస్ వచ్చింది.అది కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.

ఇంట్రెస్టింగ్‌ కథ ఉన్నా కూడా దాన్ని దర్శకుడు ఆకట్టుకునేలా మల్చడంలో విఫలం అయ్యాడు.దానికి తోడు తమన్నా పాత్ర కూడా సో సోగానే ఉంది.

ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన తమన్నా మళ్లీ వెబ్‌ సిరీస్‌ కాని సినిమా కాని ఆఫర్‌ ను దక్కించుకుంటుందా అంటే అనుమానమే అంటున్నారు.ఇప్పటికి అయినా తమన్నా సర్దేసుకుంటే బెటర్‌ అంటూ కొందరు ఆమెను ఉద్దేశించి అంటున్నారు.

మరి తమన్నా సినిమా లకు మరియు వెబ్‌ సిరీస్ లకు గుడ్‌ బై చెప్పేనా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube