తమన్నా లేకున్నా రాజుగారు వాడేస్తున్నారట  

Tamanna Name Using Raju Gari Gadhi 3 Movie Promotions-avika Gor,gari Gadhi 3 Movie Promotions,ohmkar,tamanna Exit

ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజు గారి గది 3’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రానికి నెగటివ్‌ టాక్‌ వస్తుంది.పెద్ద ఎత్తున ఈ చిత్రంను ప్రమోషన్‌ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది.అశ్విన్‌ బాబు హీరోగా అవికా గౌర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుండి కూడా మామూలుగానే ఉన్నాయి.

Tamanna Name Using Raju Gari Gadhi 3 Movie Promotions-avika Gor,gari Gadhi 3 Movie Promotions,ohmkar,tamanna Exit-Tamanna Name Using Raju Gari Gadhi 3 Movie Promotions-Avika Gor Gari Promotions Ohmkar Exit

అంచనాలు పెద్దగా లేకున్నా ఈ చిత్రం మాత్రం తప్పకుండా విజయాన్ని సాధిస్తుందని ఓంకార్‌ ఆశించాడు.కాని సినిమా ఫలితం తారు మారు అయ్యింది.

Tamanna Name Using Raju Gari Gadhi 3 Movie Promotions-avika Gor,gari Gadhi 3 Movie Promotions,ohmkar,tamanna Exit-Tamanna Name Using Raju Gari Gadhi 3 Movie Promotions-Avika Gor Gari Promotions Ohmkar Exit

మొదట రాజుగారి గది 3 చిత్రంలో హీరోయిన్‌గా తమన్నాను అనుకున్నారు.కాని పరిస్థితులు అనుకూలించని కారణంగానో లేక మరేదో కారణం వల్లనో కాని తమన్నా సినిమా నుండి తప్పుకుంది.

సినిమా నుండి తప్పుకున్నట్లుగా ప్రకటించిన తర్వాత ఆమె ఓంకార్‌ తో కాంటాక్ట్‌లో లేదట.కాని ఇటీవల ఆమె మేనేజర్‌ సినిమా విషయంలో ఓంకార్‌తో మాట్లాడాడు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాజుగారి గది 3 చిత్రం ప్రమోషన్‌లో ఎక్కువగా తమన్నా పేరు వాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడట.

 రాజుగారి గది 3 నుండి తమన్నా వెళ్లి పోయింది ఆమె వెళ్లి పోవడంకు కారణం ఏంటీ అంటూ రకరకాలుగా తమన్నాను ఈ చిత్రం ప్రమోషన్‌లో వాడేస్తున్నారట.తమన్నా ఈ చిత్రంలో నటించకున్నా కూడా ప్రమోషన్‌ సందర్బంగా ఎక్కువగా ఆమె పేరును ప్రస్తావించడంపై ఆమె సీరియస్‌ అయ్యిందని, ఓంకార్‌కు మేనేజర్‌తో కాల్‌ చేయించి మరీ తన పేరును ప్రమోషన్‌లో వాడుకోవద్దంటూ సూచించిందట.దాంతో ఓంకార్‌ ఆమె పేరును ప్రస్థావించడం లేదట.